మహిళలకు బంపరాఫర్: ప్రభుత్వం సంచలన నిర్ణయం!

పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళ పరిశుభ్రత, ఆరోగ్య ఉత్పత్తులపై ఇప్పటివరకు విధిస్తూ వచ్చిన 'పీరియడ్ ట్యాక్స్'ను పాక్ సర్కారు పూర్తిగా రద్దు చేసింది. 'పీరియడ్ ట్యాక్స్'ను పింక్ ట్యాక్స్ అని కూడా పిలుస్తారు. మరోవైపు గర్భనిరోధక సాధనాలను కూడా పన్ను రహితంగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా త్రార్ అధికారికంగా ప్రకటించారు. పాకిస్థాన్‌లోని మహిళా హక్కుల సంఘాలు, సామాజిక సంస్థలు ఈ పీరియడ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.

అసలు ఈ 'పీరియడ్ ట్యాక్స్' అంటే ఏంటి?
మహిళలు రుతుస్రావ సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్‌లు, టాంపూన్‌లు వంటి అవసరమైన ఉత్పత్తులపై ప్రభుత్వం విధించే అదనపు విక్రయ పన్నును పీరియడ్ ట్యాక్స్ లేదా పింక్ ట్యాక్స్ అని పిలుస్తారు. పాకిస్థాన్‌లో ఈ ఉత్పత్తులపై గతంలో 18 శాతం వరకు సేల్స్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ఈ అదనపు పన్నుల కారణంగా మార్కెట్లో శానిటరీ ప్యాడ్ల ధరలు దాదాపు 40 శాతం వరకు పెరిగిపోయాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని, పేద కుటుంబాలకు చెందిన మహిళలకు, యువతులకు ఇవి అందుబాటులో లేకుండా పోయాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఉత్పత్తులపై పన్ను 18 శాతం నుంచి 0 శాతానికి పడిపోయింది.

Pakistan Abolishes Period Tax Sanitary Pads and Contraceptives Made 100 Tax-Free Full Details

గర్భనిరోధకాలపైనా పన్ను మినహాయింపు
మహిళల ఆరోగ్య ఉత్పత్తులతో పాటు దేశంలో పెరుగుతున్న జనాభా నియంత్రణను దృష్టిలో ఉంచుకుని గర్భనిరోధక సాధనాలపై కూడా పన్నులను పాకిస్థాన్ ప్రభుత్వం పూర్తిగా మినహాయించింది. ప్రస్తుతం పాకిస్థాన్ ఎదుర్కొంటన్న ప్రధాన సవాళ్లలో జనాభా పెరుగుదల ఒకటని.. అందుకే రాబోయే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వీటికి పన్ను రహిత హోదా కల్పించినట్లు మంత్రి అతావుల్లా త్రార్ నేషనల్ అసెంబ్లీలో వెల్లడించారు. ఈ బడ్జెట్ దేశాన్ని ఆర్థిక పురోగతి వైపు నడిపించే ఓ రిలీఫ్ బడ్జెట్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మహిళా సంఘాల హర్షం
పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై అక్కడి మహిళా హక్కుల సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల పునరుత్పత్తి హక్కులు, రుతుస్రావ సమతుల్యత కోసం పోరాడుతున్న మహ్వారీ జస్టిస్ సంస్థ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. అలాగే టైమ్స్ మ్యాగజైన్ 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2026' జాబితాలో నిలిచిన పాకిస్తాన్ ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త మహనూర్ ఒమర్ కూడా ప్రభుత్వ చొరవను అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+