ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్..? ఆ సినిమా లేనట్టే..!

మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రిలీజైన డ్రాగన్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ మేనరిజమ్స్ తో పాటు ప్రశాంత్ నీల్ మార్క్ వరల్డ్ బిల్డింగ్ సినిమాపై గ్లోబల్ రేంజ్ లో అంచనాలను పెంచేశాయి. డ్రాగన్ మూవీతో పాటు ఎన్టీఆర్.. 'దేవర 2', త్రివిక్రమ్ తో 'గాడ్ ఆఫ్ వార్' వంటి క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఎన్టీఆర్- కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. ఈ క్రేజీ కాంబోపైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీకి నాగవంశీ నిర్మాతగా ఉంటారని టాక్ వినిపించింది. అయితే పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ను కాదని నెల్సన్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమాను రెడీ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం 'జైలర్ 2' షూటింగ్ లో బిజీగా ఉన్న నెల్సన్.. ఈ మూవీ పూర్తి కాగానే, సూర్యతో ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నెల్సన్- ఎన్టీఆర్ కాంబోలో మూవీ పట్టాలెక్కకపోవడానికి ఎన్టీఆర్ బీజీ షెడ్యూలే కారణమని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

NTR Nelson Drops NTR Teams Up with Suriya for Upcoming Film Major Kollywood Update Nelson NTR

మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఇటీవల కరుప్పు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సూర్య. తెలుగులో వీరభద్రుడు అనే పేరుతో రిలీజై ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. రూ. 300 కోట్లకు పైగా సాధించి ఈ ఏడాది అత్యధికంగా వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సూర్య- వెంకీ అట్లూరి కాంబోలో వచ్చిన విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ తర్వాత జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్‌ తో మరో చిత్రంలో సూర్య నటించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్- నెల్సన్ మూవీకి బ్రేక్ పడటంతో ఫ్యాన్స్ అప్ సెట్ లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+