కంపెనీ వాట్సాప్ గ్రూప్ లో నుంచి ఔట్, ఆఫీసులో వీడు ఏం చేశాడంటే ?, బాస్ ఐప్యాడ్ లో అంతా !
మహారాష్ట్రలోని పూణేలో ఒక ఉద్యోగి తన పై అధికారిని సంస్థ వాట్సాప్ గ్రూప్ నుండి తొలగించినందుకు కార్యాలయంలోని ఉద్యోగులందరి ముందు చితకబాదేశాడు. అధికారిని కొట్టిన యువకుడి మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంపెనీ ఉద్యోగులు అందరి ముందు అతను ఓ సైకోలో రెచ్చిపోయి కంపెనీలో నానా హంగామా చేశాడని సాటి ఉద్యోగులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన పూణే సిటీలోని చదన్ నగర్‌లోని ముంధ్వా రోడ్డులో చోటుచేసుకుంది. తాను పనిచేస్తున్న కంపెనీ వాట్సాప్ గ్రూప్ నుంచి తనను తొలగించారని ఆగ్రహం చెందిన ఓ ఉద్యోగి.. పై అధికారిని కొట్టి ఆ కంపెనీ బాస్ ఐ ఫోన్ ధ్వంసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు ఈ ఫిర్యాదుపై ఆ కంపెనీ ఉద్యోగిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పూణే సిటీ పోలీసులు తెలిపారు.

మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ముంధ్వా రోడ్డులోని కార్యాలయంలో ఈ ఘటన జరిగింది పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పూణెలోని లోహెగావ్ సమీపంలోని ఖాండ్వే నగర్‌లో నివాసం ఉంటున్న ఇన్‌స్టా గో ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన అమోల్ శేషారావు ధోబ్లే బుధవారం చందన్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర పోలీసు అనేక సెక్షన్ల కింద నిందితుడి మీద కేసు నమోదు చేశారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కేసులో నిందితుడి పేరు సింఘ్వీ. కంపెనీ ఉద్యోగి సింఘ్వీ మీద అదే కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు ఆ సంస్థ యజమాని ధోబ్లేకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ సంస్థ యజమాని ధోబ్లే కంపెనీ ఉద్యోగి సింఘ్వీని అతని క్యాబిన్ కు పిలిపించి నీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పాడు. అయితే సింఘ్వీ మాత్రం అతని ప్రవర్తన మార్చుకోకుండా అతని పద్దతి కూడా మారలేదు.

పద్దతి మార్చుకోలేదని తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం సింఘ్వీని కంపెనీ వాట్సాప్ గ్రూప్ నుండి తొలగించారు. దీంతో రగిలిపోయిన సింఘ్వీ కోపంగా అతని కంపెనీలో సీనియర్ అధికారి మీద శారీరకంగా దాడి చేయడమే కాకుండా, అతని కంపెనీ యజమాని ధోబ్లే ఐ ప్యాడ్ ను అందరి ముందే ద్వంపం చేశాడని పోలీసు అధికారులు తెలిపారు ఈ ఘటనపై చందన్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications