Engineer: ఇంజనీర్, 185 క్రెడిట్ కార్డుల పెట్టుబడి, నెలకు లక్షల్లో సంపాధన, కేటుగాడి వ్యవహారంతో ?

బెంగళూరు: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వ్యక్తి ఉద్యోగం చెయ్యకుండా సొంతంగా ట్రావెల్స్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. అక్కడే అతను అసలు కథ మొదలుపెట్టాడు. కస్టమర్ల క్రెడిట్ కార్డులు ఉపయోగించి నెలకు రూ. 4 లక్షలకు పైగా సంపాధించాడు. చాలాకాలంగా మనోడి అసలు బండారం బయటకు రాలేదు. స్వయంగా డీసీపీ రంగంలోకి దిగడంతో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఇంజనీర్ టెక్నీక్ లు, అతని హాలీవుడ్ సినిమా స్కెచ్ లు తెలుసుకున్న పోలీసు అధికారులు హడలి పోయారు.

బెంగళూరులో ఖతర్నాక్

బెంగళూరులో ఖతర్నాక్

అమాయకులకు అరటి పండు తినిపించి మోసం చేస్తున్న ఖతర్నాక్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పాండే అనే వ్యక్తి అరెస్టు అయ్యాడు. నిందితుడు పాండే బెంగళూరులోని బనశంకరిలో నివాసం ఉంటూ అనేక మందిని మోసం చేస్తున్నాడు. బెంగళూరు సౌత్ డివిజన్ డీసీపీ కృష్ణకాంత్ ఎంట్రీ ఇవ్వడంతో నిందితుడు పాండే మోసాల గురించి వెలుగులోకి వచ్చింది.

కాన్పూర్ లో ఇంజనీరింగ్

కాన్పూర్ లో ఇంజనీరింగ్

పోలీసుల విచారణలో నిందితుడు పాండే నిజస్వరూపం బయటపడింది. పాండే మోసాల గురించి తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. పట్టుబడిన నిందితులు పాండే క్రెడిట్ కార్డు కస్టమర్లను టార్గెట్ చేసి మోసం చేస్తున్నట్లు వెలుగు చూసింది. నిందితుడు పాండే కాన్పూర్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐఐటీలో చదివాడని పోలీసులు అంటున్నారు. పాండే అతని తెలివితేటలతో ఉద్యోగం వదిలేసి మోసం చేయాలని ప్లాన్ వేసి చివరికి అరెస్టు అయ్యాడు.

నెలకు రూ. 4 లక్షలు ఆధాయం

నెలకు రూ. 4 లక్షలు ఆధాయం

ప్రజలను మోసం చేస్తూ నెలకు రూ 3 లక్షల నుంచి రూ. 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్న పాండే లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడని పోలీసులుఅంటున్నారు. క్రెడిట్ కార్డ్ కస్టమర్ల డబ్బుతో పాండే ఆటలు ఇంతకాలం నడిచాయి. పాండే మోసం గురించి కస్టమర్లకు మాత్రమే ఇంత వరకు తెలియదు. పాండే అప్పులు ఇప్పిస్తూ క్రెడిట్ రివార్డు పాయింట్లతో పాటు వడ్డీ సొమ్మును మింగేస్తున్నాడని, ఇతని. తెలివితేటలు తెలీక ఇప్పటి వరకు 185 మంది కస్టమర్లు నిందితుడికి క్రెడిట్ కార్డు ఇచ్చారని పోలీసులు అన్నారు.

ఇదీ లెక్క... హాలీవుడ్ సినిమా స్కెచ్

ఇదీ లెక్క... హాలీవుడ్ సినిమా స్కెచ్

పాండే మొదటి కస్టమర్ బిల్లును రెండో కస్టమర్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తున్నాడు. రెండో కస్టమర్ క్రెడిట్ బిల్లును మూడో కస్టమర్‌తో సెటిల్ చేసేవాడు. అదేవిధంగా బిల్లుల చెల్లింపులు చేస్తూ చాలా మంది దగ్గర పాండే నమ్మకం సంపాధించాడని, ఇలా పలువురిని నమ్మించి వారీ క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేసి నెలనెల లక్షల రూపాయాల డబ్బు సంపాధిస్తున్నాడని పోలీసులు అన్నారు.

ట్రావెల్స్ ముసుగులో దందాలు

ట్రావెల్స్ ముసుగులో దందాలు

అరెస్టయిన నిందితుడు పాండే ట్రావెల్ ఏజెన్సీని నడుపుతూ క్రెడిట్ కార్డులతో టిక్కెట్లు బుక్ చేసుకునేవాడు. అందులోంచి రివార్డు పాయింట్లను రీడీమ్ చేసి డబ్బు సంపాదించేవాడు. స్వైప్‌ మిషన్‌ను పాండే ఓ హోటల్‌ పేరుతో కొనుగోలు చేశాడని, ఆ హోటల్‌ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఈకేసు వెలుగులోకి వచ్చింది. నిందితుడు పాండేని అరెస్ట్ చేసిన పోలీసులు అతని బ్యాంకు ఖాతాను సీజ్ చేశారు. పాండేని అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి 185 క్రెడిట్ కార్డులు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, 7 మొబైల్స్, 2 స్వైపింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ కొనసాగిస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+