భార్య మీద కోపంతో కవల పిల్లలను చంపేసిన ఇంజనీర్ !
బెంగళూరు: భార్య మీద పగ పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఎంతో ముద్దుగా ఉన్న కలవల పిల్లలను చంపేసిన తండ్రి అతని కసి తీర్చుకున్నాడు. అద్వైత్, అన్విత్ అనే నాలుగు సంవత్సరాల కవలల పిల్లలను అతని తండ్రి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని దావణగెరె నగరంలోని ఆంజనేయ బరంగేయలో నివాసముంటున్న అమర్ (36) అనే కిరాతకుడు అతని కవలల పిల్లలను చంపేశాడు.
వాస్తవానికి బెళగావి జిల్లాలోని గోకాక్‌కు చెందిన అమర్ కొన్ని సంవత్సరాల క్రితం దావణగెరె చేరుకుని హరిహర్‌లోని ఫ్యాక్టరీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో పనిచేస్తున్నాడు. విజయపురానికి చెందిన విజయలక్ష్మితో కొన్నేళ్ల క్రితం అమర్ వివాహం చేసుకున్నాడు. మొదట్లో భార్యతో అమర్ బాగానే ఉన్నాడు. నాలుగు సంవత్సరాల విజయలక్ష్మి, అమర్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. వారికి అద్వైత్, అన్విత్ అని పేరు పెట్టారు.

కొద్ది రోజుల క్రితం విజయలక్ష్మి కొన్ని కారణాల వల్ల పిల్లలు, భర్తను వదిలి విజయపురంలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అమర్ భార్య విజయలక్ష్మి మీద రగిలిపోతున్నాడు. కవలల పిల్లలు అమర్ తల్లి సావిత్రమ్మ వద్ద ఉన్నారు. అయితే నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అద్వైత్, అన్విత్‌లను అమర్ అతని కారులో తీసుకెళ్లాడు. భార్య విజయలక్ష్మికి ఫోన్ చేసి నీ పిల్లలను చంపేస్తానని అమర్ బెదిరించాడు.

అయితే ఉదయం చలగేరి టోల్ సమీపంలో వారిని తీసుకెళ్లి సర్వీస్ రోడ్డులో కారు ఆపి పిల్లలిద్దరి మెడలను టేపుతో బిగించి ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత భార్య విజయలక్ష్మికి ఫోన్ చేసిన అమర్ నీ పిల్లలను చంపేశానని చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అమర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా అమర్ ను గుర్తించారు. పిల్లలను ఊపిరిరాడక చేసి హత్య చేసినట్లు అమర్ విచారణలో అంగీకరించాడరి పోలీసులు తెలిపాయి.












Click it and Unblock the Notifications