Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లిలో పెళ్లి కూతురు ఏం చేసిందంటే ?, ఎవడో వచ్చి పెళ్లికూతురికి పిస్తోల్ ఇస్తే ?, అంతేగా అంతేగా !

ఈ రోజుల్లో పెళ్లికి చాలా ప్రత్యేకత ఉంది. జీవితంలో ఒక్కసారి జరిగే పెళ్లిని గుర్తుండిపోయేలా చేసేందుకు యువకులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కొత్త జంట రకరకాల ఫోటో షూట్ లు, వీడియోలు చేసి, వాళ్లకు నచ్చిన ప్రదేశంలో పెళ్లి చేసుకుంటారు. అందుకు చాలానే సిద్ధం చేసుకుంటారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పెళ్లికి ముందు పార్టీ పెట్టేవారూ ఉన్నారు.

ప్రజలు తమ పెళ్లి రోజును గుర్తుండిపోయేలా చేయడానికి కొత్త సాహసాల కోసం వెళుతారు. గుర్రంపై వధువు ఇంటికి వచ్చే వరుడి స్థానాన్ని ఇప్పుడు వధువు ఆక్రమించి కొత్తకొత్త ప్రయోగాలు చెయ్యడం మొదలుపెట్టారు. చాలా మంది అమ్మాయిలు తమ పెళ్లి ఇంటికి గుర్రపు స్వారీ చేయాలని కలలు కంటారు. కొంతమంది అమ్మాయిలు తమ వివాహాన్ని చాలా భిన్నంగా జరుపుకుంటున్నారు. అమ్మాయిలు బుల్లెట్లు తొలుతూ కళ్యాణ మండపానికి రావడం కూడా చూడవచ్చు. చాలా సార్లు అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ల పెళ్లిరోజు జోష్‌లో చేసిన పని గందరగోళంగా ఉంటుంది.

An FIR was filed against the daughter of the bride who opened fire with a pistol at the wedding

పెళ్లి సంతోషంలో ఈ జంట చేసిన ఓ పని ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. పెళ్లి సమయంలో గుర్రం, ఏనుగు, బైక్‌తో సహా ఏదైనా జంతువులను వాడితే ఇప్పుడు పెద్దగా చర్చ జరగడం లేదు. ఎందుకంటే అది పాత ఫ్యాషన్ అంటున్నారు జనాలు. కానీ వివాహ వేడుకల్లో పిస్టల్ వాడేందుకు అనుమతి లేదు. ఒకవేళ అనుమతి దొరికినా అత్యవసర కారణాల కోసం మాత్రమే పిస్తోల్, రివాల్వర్, తుపాకి ఉపయోగించాలి. అనుమతి లేకుండా పిస్టల్ ఉంచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తారు.

అనుమతి లేకుండా తుపాకులతో గాలిలో కాల్చడం ఇప్పుడు తీవ్రమైన నేరం. అయితే పెళ్లి ఆనందంలో ఈ వధువు పిస్తోల్ తో గాలిలో కాల్చులు జరిపింది. పెళ్లికూతురు పిస్తోల్ తో గాలిలోకి కాల్పులు జరుపుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పెళ్లి ఇంటిలో వధువు పిస్తోల్ తో గాల్లోకి కాల్పులు జరిపింది. వధూవరులతోపాటు గుర్తుతెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం వధూవరులు ఎవరు అనే విషయం పోలీసులకు తెలియడం లేదు. ఈ ఘటన ఖతౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇది దుద్దలి గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన వీడియో అని పోలీసులు అంచనా వేసినప్పటికీ పెళ్లికూతురు పిస్తోల్ తో గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో తీసిన ఒరిజినల్ వీడియో మాత్రం పోలీసులకు చిక్కలేదని తెలిసింది. ఈ కేసుకు సంబందించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిసింది.

వైరల్ వీడియో 23 సెకన్లుఉందని పోలీసు అధికారులు అంటున్నారు. వీడియో ప్రారంభంలో, వధూవరులు నిలబడి ఉన్నారు. అక్కడికి మరో వ్యక్తి వెళ్లి పెళ్లికూతురికి పిస్టల్ ఇస్తాడు. వధువు పిస్టల్ పైకెత్తి కాల్పులు జరుపుతుంది. అప్పుడు ఆ వ్యక్తి మళ్లీ కాల్చమని చెప్పాడు. ఆ విధంగా ఆమె మూడు సార్లు పిస్తోల్ తో గాల్లోకి కాల్పులు జరిపాడని వీడియోలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

వధువు పిస్తోల్ తో షూట్ చేస్తున్నప్పుడు చాలా మంది ఆమెను వెనుక నుండి ఆమెను ప్రశంసించడం వీడియోలో ఉంది. వారిలో ఒకరు వావ్, ఈ సౌండ్ కు చెవులు చిల్లుమన్నాయని అంటే కొందరు చాలా బాగుందని అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు వధూవరులతో పాటు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని విచారిస్తున్నారు. గుర్తు తెలియని నవ దంపతులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+