Kerala: తనపై దాడి చేసినట్లు ఆర్మీకి చెందిన వ్యక్తి తప్పుడు ఫిర్యాదు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
కేరళలోని కొల్లం జిల్లాలో ఆర్మీలో పని చేస్తున్న తనపై ఆరుగురు దాడి చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత తన వీపుపై పీఎఫ్ఐ అని రాసిననట్లు ఆరోపించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అతన్ని ఎవరు కొట్టలేదని. అతను అసత్య ఆరోపణలు చేసినట్లు నిర్ధారించారు. కొల్లాం రూరల్‌లోని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్. ప్రతాపన్ నాయర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఆర్మీకి చెందిన వ్యక్తి జాతీయ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో అతను ఈ చర్యకు ప్లాన్ చేసినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. "నిందితుడైన సాలిడర్, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మీ సిబ్బంది ఫిర్యాదు నకిలీది, అతను జాతీయ దృష్టిని ఆకర్షించడానికి ఈ పని చేశాడు. మంచి ఉద్యోగావకాశాన్ని పొందాలనే ఉద్దేశ్యంతో ఈ మోసపూరిత చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరినీ కోర్టు ముందు హాజరు పరచాం" అని నాయర్ చెప్పారు.

ఆదివారం రాత్రి కడక్కల్‌లోని తన ఇంటి పక్కనే ఉన్న రబ్బరు అడవిలో ఆరుగురు వ్యక్తుల బృందం తనపై దాడి చేసిందని షైన్ కుమార్ అనే ఆర్మీ సిబ్బంది తన ఫిర్యాదులో తెలిపారు. వారు అతని చేతులను టేప్‌తో కట్టివేసి, ఆకుపచ్చ పెయింట్‌తో అతని వీపుపై PFI అని రాశారని చెప్పాడు.
పోలీసు విచారణలో, షైన్ స్నేహితుడు జోషి ఆర్మీ అధికారి ప్రసిద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. అందుకే ఇలా చేసినట్లు పేర్కొన్నాడు.
షైన్ తన చొక్కా చింపిన తర్వాత తన వీపుపై "PFI" అని వ్రాయమని సూచించినట్లు స్నేహితుడు జోషి పేర్కొన్నాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న జోషిని తప్పుగా అర్థం చేసుకుని మొదట్లో దానికి బదులు 'డీఎఫ్‌ఐ' అని రాసినట్లు పోలీసులు గుర్తించారు. "నేను తాగి ఉన్నాను, కాబట్టి నేను మొదట డిఎఫ్‌ఐ రాశాను, కాని అతను (కుమార్) పిఎఫ్‌ఐ రాయమని చెప్పాడు. కాబట్టి నేను పిఎఫ్‌ఐ రాశాను" అని జోషి అన్నారు.
కొల్లాం పోలీసులు ఈ ఘటనలో ఉపయోగించిన ఆకుపచ్చ పెయింట్, బ్రష్ మరియు టేప్‌ను స్నేహితుడి ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు.PFI అనేది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా.












Click it and Unblock the Notifications