Crime News: ఇంట్లోనే శవాన్ని పూడ్చిపెట్టి ఫ్లోరింగ్ చేశారు.. దృశ్యం సినిమా చూపించారు..!
వెంకటేష్, మీనా నటించిన దృశ్యం సినిమా గుర్తుందా.. ఈ మూవీలో ఓ వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని కొత్తగా కడుతున్న పోలీస్ స్టేషన్ లో పాతి పెడతారు. ఆ వ్యక్తిని చంపింది ఎవరో పోలీసులు నిరూపించలేకపోతారు. ఇది సినిమా.. కానీ నిజ జీవితంలో కూడా దృశ్యం సినిమా చూపించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కేరళలో జరిగింది.

అదృశ్యం
కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన బిందు కుమార్(40) వారం నుంచి కనిపించకుండా పోయాడు. అతడు అలప్పుళకు వెళ్లి అదృశ్యయ్యాడు. అతడు కనిపించకపోయేసరికి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అలప్పుళ నార్త్ పోలీసులు విచారణ చేపట్టారు. బింద్ కుమార్ కాల్ రికార్డులు పరిశీలించారు.

కాల్ డేటా..
బిందు కుమార్ చివరిసారిగా కొట్టాయం జిల్లా చంగనేస్సరికి చెందిన ముత్తు కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.పోలీసులు వెంటనే ముత్తు కుమార్ ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ అతను లేడు. చుట్టుపక్కల వాళ్లను ముత్తు గురించి అడగ్గా.. కొద్దిరోజుల నుంచి ముత్తు కుమార్ ఇంట్లో మరమ్మతులు జరుగుతున్నాయని వారు వివరించారు.

ప్లోరింగ్
అనుమానం వచ్చిన పోలీసులు కొత్తగా వేసిన ఫ్లోరింగ్ ను బద్దలుకొట్టించారు. దాదాపు 30 నిమిషాలు తవ్వాక వారికి మృతదేహం ఉన్న సంచి కనిపించింది. అది బిందు కుమార్‌దేనని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్షలో అది ఎవరి మృతదేహమో తేలనుంది.












Click it and Unblock the Notifications