Iran Flight: ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు.. వెనకాలే వెళ్లిన భారత యుద్ధ విమానాలు..
ఇరాన్ లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్యాంగ్ జౌకు వెళ్తున్న మహాన్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం తెల్లవారుజామున ఇరానియన్ క్యారియర్ మహన్ ఎయిర్ నిర్వహిస్తున్న ఎయిర్‌బస్ A340 విమానం గ్యాంగ్ జౌక్ బయల్దేరింది. ఉదయం 9 గంటల 20 నిమిషాలకు విమానం భారత భూభాగంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.

35,000 అడుగుల ఎత్తులో
విమానం మొదట ఢిల్లీకి పశ్చిమాన 200 కి.మీ దూరంలో హోల్డింగ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు దాని క్రూజింగ్ ఎత్తు 35,000 అడుగుల ఎత్తులో ఉండగా బాంబు బెదిరింపు రాగా వెంటనే ఢిల్లీ ఎయిర్ పోర్టును భారత వైమానిక దళం అప్రమత్తం చేసింది. పైలట్ విమానం ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరగా.. జైపూర్ లేదా చండీఘడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయాలని అధికారులు చెప్పారు.

చైనా గగనతలం
అక్కడ విమానం ల్యాండింగ్ చేసేందుకు పైలట్ ఇష్టపడలేదు. దీంతో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఆ విమానాన్ని ఫాలో అయ్యాయి. పైలట్ విమానాన్ని చైనా గగనతలం దిశగా మళ్లించారు. ఢిల్లీలో అనుమతించకపోవడంతో పైలట్ విమానాన్ని చైనా గగనతలం దిశగా మళ్లించినట్లు తెలిసింది.

IAF యుద్ధ విమానాలు
2022 అక్టోబర్ 3న ఇరాన్ రిజిస్ట్రేషన్ కలిగిన విమానయాన సంస్థ భారత గగనతలం గుండా ప్రయాణిస్తున్నప్పుడు బాంబు బెదిరింపు వచ్చిందని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. IAF యుద్ధ విమానాలతో విమానాన్ని సురక్షితమైన దూరంలో అనుసరించాయని పేర్కొంది. విమానంలో బాంబు లేదని టెహ్రాన్ నుంచి సమాచారం అందడంతో వైమానిక దళాలు వెనుదిరిగాయి.












Click it and Unblock the Notifications