madam: భర్తకు బాయ్ చెప్పి ప్రియుడితో రొమాన్స్, అడ్డుపడిన తమ్ముడిని ముక్కలుగా నరికిన అక్క !
తన ప్రేమకు, అక్రమ సంబంధానికి అడ్డుపడిన తమ్ముడిని సొంత అక్క ఆమె ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.
బెంగళూరు/నాసిక్: ఇప్పుడు 8 ఏళ్ల క్రితం హత్య జరిగింది. హత్యకు గురైన యువకుడి కాళ్లు, చేతులు, తల తదితర బాగాలు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కాయి. హత్యకు గురైన యువకుడి గురించి, హత్య చేసిన వాళ్ల గురించి పోలీసులకు ఏమాత్రం చిన్న క్లూ చిక్కలేదు. పోలీసులు కోర్టులో సీ రిపోర్టు కూడా సమర్పించారు .అయితే కేసు రీ ఓపెన్ కావడంతో యువకుడి హత్య రహస్యం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తన ప్రేమకు, అక్రమ సంబంధానికి అడ్డుపడిన తమ్ముడిని సొంత అక్క ఆమె ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

బెంగళూరు వచ్చిన అక్కా తమ్ముడు
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఇండి తాలూకాలోని దేవంగావ్ గ్రామంలో లింగరాజు సిద్దప పూజారి అలియాస్ లింగరాజు అనే యువకుడు నివాసం ఉండేవాడు. ఇతని అక్క భాగ్యశ్రీ, భాగ్యశ్రీ ప్రియుడు శంకరప్ప తల్వార్ అలియాస్ శంరప్ప 8 ఏళ్ల క్రితం పని నిమిత్తం బెంగళూరు వచ్చారు. బెంగళూరు నగర శివార్లలోని జిగణి ఇండస్ట్రియల్ ఏరియాలో లింరాజు, అతని అక్క భాగ్యశ్రీ, ఆమె ప్రియుడు శంకరప్ప ఒకే కంపెనీలో పనికి చేరారు. భాగ్యశ్రీ, శంకరప్ప ప్రేమించుకుంటున్నారు.

గతంలో భర్తకు విడాకులు
భాగ్యశ్రీ, శంకరప్ప కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోని నేపథ్యంతో భాగ్యశ్రీ వేరే వ్యక్తితో, శంకరప్ప వేరే మహిళతో చాలా సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే శంకరప్ప అతని భార్యను వదిలేసి బెంగళూరు వెళ్లిపోయాడు. పెళ్లయిన రెండు సంవత్సరాలకే భర్తను వదిలేసిన భాగ్యశ్రీ పుట్టింటికి వెళ్లింది. తరువాత శంకరప్ప భాగ్యశ్రీని బెంగళూరు రావాల్సిందిగా కోరాడు. అక్క భాగ్యశ్రీ వెంటనే ఆమె తమ్ముడు లింగరాజుని తీసుకుని బెంగుళూరు వెళ్లింది. ముగ్గురూ జిగణిలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ సమీపంలోని వడ్డెర మంచనహళ్లిలో అద్దె ఇంట్లో ఉండేవారు.

ప్రియుడితో కలిసి తమ్ముడిని చంపేసింది
కొంతకాలం తరువాత భర్తను వదిలేసిన అక్క భాగ్యశ్రీ శంకరప్పతో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న లింగరాజు రగిలిపోయాడు. శంకరప్పకు దూరంగా ఉండాలని అక్క భాగ్యశ్రీకి వార్నింగ్ ఇచ్చాడు. 2015 లోఓ రోజు భాగ్యశ్రీ, శంకరప్ప ఏకాంతంగా ఉన్న సమయంలో లింగరాజు అనుకోకుండా ఇంటికి వెళ్లి ఆ సీన్ చూసి రెచ్చిపోయాడు. అక్క ప్రియుడు శంకరప్పను పట్టుకుని చికతబాదేశాడు. ఆ సందర్బంలో భాగ్యశ్రీ పదునైన ఆయుధంతో తమ్ముడు లింగరాజు మీద దాడి చెయ్యడంతో అతని ప్రాణం పోయింది, లింగరాజు శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన భాగ్యశ్రీ, ఆమె ప్రియుడు శంకరప్ప మూడు బ్యాగ్ లో ముక్కలు పెట్టుకుని వాటిని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేసి వెళ్లిపోయారు.

కోర్టులో సీరిపోర్టు
రెండు రోజుల తరువాత జిగణి పరిసర ప్రాంతాల్లో యువకుడి శరీరంలోని ముక్కలు చిక్కడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. అయితే హత్యకు గురైయ్యింది లింగరాజు అని పోలీసులు గుర్తించలేకపోయారు. 2018లో కోర్టులో సీరిపోర్టు సమర్పించిన జిగణి పోలీసులు కేసు క్లోజ్ చేశారు. ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి రవికాంత్ గౌడ క్రైమ్ రివీల్ చేస్తున్న సమయంలో ఈ కేసు వ్యవహారం బయటకు వచ్చింది. కేసు రీ ఓపెన్ చెయ్యాలని రవికాంత్ గౌడ జిగణి పోలీసులకు చూసించారు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు.

నాసిక్ లో నంగనాచి అక్క
లింగరాజును హత్య చేసిన భాగ్యశ్రీ, ఆమె ప్రియుడు శంకరప్ప బెంగళూరు ఖాలీ చేసి వారి సొంత ఊరిపక్క కన్నెత్తికూడా చూడకుండా, బంధువులు, స్నేహితులు ఎవ్వరితో టచ్ లో లేకుండా మహారాష్ట్రలోని నాసిక్ వెళ్లిపోయి అక్కడ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. భాగ్యశ్రీ ఆమె పేరును ప్రియాంకాగా, శంకరప్ప అతని పేరును వినోద్ రెడ్డిగా మార్చుకుని నాసిక్ లో ఉంటున్నారు. పక్కా సమాచారం తెలుసుకున్న బెంగళూరులోని జిగణి పోలీసులు నాసిక్ చేరుకుని భాగ్యశ్రీ, శంకరప్పను అరెస్టు చేసి బెంగళూరు పిలుచుకుని వచ్చారు. తమ్ముడి హత్య కేసులో అతని అక్క భాగ్యశ్రీ 8 ఏళ్ల తరువాత పోలీసులకు చిక్కడం హాట్ టాపిక్ అయ్యింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications