కొడుకు వేరేఊరిలో పోలీసు, కోడలిని గొడ్డలితో నరికి స్పాట్ లో చంపేసిన మామ !
లక్నో/ఉత్తరప్రదేశ్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఇంట్లో హత్య జరిగింది. మామ కోడలిని దారుణంగా నరికి చంపేశాడు. హత్యకు గురైన మహిళ ఓ పోలీసు భార్య కావడం హాట్ టాపిక్ అయ్యింది. కోడలినిని హత్య చేసిన అనంతరం నిందితుడు 62 ఏళ్ల రఘువీర్ సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని మల్లికాపుర గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రియాంక సింగ్ (27) అనే మహిళ హత్యకు గురైందని పోలీసు అధికారులు తెలిపారు. హంతకుడు రఘువీర్ సింగ్ కుమారుడు గౌరవ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్‌లోని ఓ పోలీస్ స్టేషన్ లో పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడని, ప్రియాంక హత్యకు గురైన సమయంలో ఆమె భర్త గౌరవ్ సింగ్ ఇంట్లో లేడని పోలీసు అధికారులు అంటున్నారు.

రఘువీర్ సింగ్‌కు మరో కుమారుడు ఉన్నాడని, అతను ఇటీవలే మరణించాడని పోలీసులు అన్నారు. పెద్ద కుమారుడు చనిపోవడంతో అతని భార్య ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడ నివసించేది. అయితే నెలకు ఒకసారి పెద్ద కోడలు రఘువీర్ సింగ్ ఇంటికి వచ్చి వారం రోజుల ఉండి మళ్లీ పుట్టింటికి వెళ్లిపోతున్నది.
పెద్ద కోడలు, చిన్న కోడలు ప్రియాంక కలిసి ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి జీవించాలని వాళ్ల మామ రఘువీర్ సింగ్ చెప్పాడు. అయితే ఇద్దరు కోడళ్ల మధ్య సఖ్యత లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి, పెద్ద కోడలు ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఇంట్లో గొడవలు జరిగేవి. అదేవిధంగా మరోసారి ఇద్దరు కోడళ్ల మధ్య గొడవ జరిగింది. గొడవను ఆపడానికి మామ రఘువీర్ సింగ్ ఇద్దరు కోడళ్ల మధ్య జోక్యం చేసుకున్నాడు.
ఆ సమయంలో చిన్న కోడలు ప్రియాంక ఆమె మామ రఘువీర్ సింగ్ ను గట్టిగా తోసేయడంతో ఆయన కిందపడిపోయి గాయాలైనాయి. వయసులో పెద్దవాడు, మామ అనే గౌరవం లేకుండా తన చిన్న కోడలు ప్రియాంక తన మీద దాడి చేసిందని రఘువీర్ సింగ్ రగిలిపోయాడు. దీంతో కోపోద్రిక్తుడైన మామ రఘువీర్ సింగ్ ఇంట్లోని గొడ్డలి తీసుకుని అతని చిన్న కోడలు ప్రియాంకా సింగ్ ను నరికి చంపేశాడు,

రక్తపు మరకలు ఉన్న చేతులు శుభ్రం కూడా చేసుకోకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రఘువీర్ సింగ్ లొంగిపోయాడని డీసీపీ సోనమ్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితుడు రఘువీర్ సింగ్ కుమారుడు పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడు, అతను ఫరూఖాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.ఈ ఘటన జరిగినప్పుడు ప్రియాంక భర్త డ్యూటీలో ఉన్నాడని పోలీసులు అన్నారు.
బాధితురాలు ప్రియాంక తండ్రి ఫిర్యాదు మేరకు రఘువీర్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రియాంక భర్త గౌరవ్ సింగ్ పేరు కూడా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని కిర్వాలీ పోలీస్ స్టేషన్ చీఫ్ ఉపేంద్ర కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. మొత్తం మీద మామ మీద చెయ్యి చేసుకున్న కోడలిని ఆమె మామ నరికి చంపడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications