చదువురాని సన్నాసి, 15 మంది లేడీస్ తో పెళ్లి, లేడీ టెక్కీ, డాక్టర్, ఇంజనీర్ లతో ఎంజాయ్ !
బెంగళూరు: అందంగా ఉన్న ఓ యువకుడు పెళ్లి కోసం మ్యాట్రీమోనీలో అతని బయోడేటా పెట్టాడు. యువకుడు అందంగా ఉన్నాడని ఓ లేడీ టెక్కీ అతన్ని సంప్రధించి గుడ్డిగా అతన్ని పెళ్లి చేసుకుంది. మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో కొంతకాలం కాపురం చేసిన అతను ఆమె నగలు, నగదు, విలువైన వస్తులు దోచుకుని ఎస్కేప్ అయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేస్తే మనోడు 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడని వెలుగు చూసింది.
ఇప్పటికే కాలాంతకుడు లెక్కలేనంత మందిని సినిమా స్టైల్లో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని షాక్ అయ్యారు. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని బనశంకరిలో మహేష్ నాయక్ అలియాస్ మహేష్ అలియాస్ నాయక్ (35) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఎర్రగా, పొడవుగా ఉన్న మహేష్ నాయక్ అతని పేరుతో వివిద మ్యాట్రీమోని వెబ్ సైట్ లో అతని బయోడేటా పోస్టు చేసి తాను మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నానని సమచారం ఇచ్చాడు.

ఇదే ఏడాది మైసూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్న ఓ యువతి మహేష్ నాయక్ ను సంప్రధించింది. తాను తుమకూరులో డాక్టర్ గా పని చేస్తున్నానని నమ్మించిన మహేష్ నాయక్ లేడీ టెక్కీని వలలో వేసుకున్నాడు. లేడీ టెక్కిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న మహేష్ నాయక్ తుమకూరులో ఓ క్లీనిక్ కూడా పెట్టాడు.
డాక్టర్ తనకు మొగుడు కాబోతున్నాడని మురిసిపోయిన మైసూరులో నివాసం ఉండే ఓ లేడీ టెక్కీ ఎగిరిగంతేసింది. మహేష్ నాయక్ ను లేడీ టెక్కీ పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల పాటు లేడీ టెక్కీతో కాపురం చేసిన మహేష్ నాయక్ తరువాత తాను ఇంకా పెద్దగా ఆసుపత్రి పెట్టాలని చెప్పి ఆమెను డబ్బులు ఇవ్వాలని బేధింపులకు గురి చేశాడు. నువ్వు అడిగినంత డబ్బులు తన దగ్గర లేవని ఆ లేడీ టెక్కి మహేష్ నాయక్ కు చెప్పింది.
తన లేడీ టెక్కీ భార్య నుంచి డబ్బులు రావడం కష్టం అని తెలుసుకున్న మహేష్ నాయక్ ఆమె ఇంట్లో లేని సమయంలో ఆమె బంగారు నగలు, బీరువాలో ఉన్న నగదు లూటీ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. మహేష్ నాయక్ తనను మోసం చేశాడని ఆలస్యంగా గుర్తించిన లేడీ టెక్కి మైసూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు మహేష్ నాయక్ ను అరెస్టు చేసి విచారణ చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే వివరాలు బయటకు వచ్చాయి. మహేష్ నాయక్ కేవలం ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడని, అతని అందంతో అమ్మాయిలకు ఎర వేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో లేడీ టెక్కి హడలిపోయింది.
2014 నుంచి మ్యాట్రీమోని వెబ్ సైట్ లో వివరాలు సేకరించిన మహేష్ నాయక్ ఇంతకాలం తాను డాక్టర్ అని, ఇంజనీర్ అని, సివిల్ కాంట్రాక్టర్ అని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చాలా మంది అమాయకులైన యువతును మెసం చేశాడని, ఇప్పటి వరకు 15 మందిని పెళ్లి చేసుకుని మోసం చేశాడని, ఇప్పటికే మహేష్ కారణంగా అతను పెళ్లి చేసుకున్న మహిళలకు నలుగురు పిల్లలు ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఇంతకాలం మోసం చేసి అమాయకులైన మహిళలను పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తూ వారి దగ్గర నగదు, నగలు లూటీ చేస్తున్న మహేష్ పారిపోతున్నాడని పోలీసులు అన్నారు. మహేష్ పెళ్లి చేసుకున్న అందరూ బాగా చదువుకున్న వారేఅని, పరువు పోతుందని కొందరు, భయంతో కొందరు ఫిర్యాదు చెయ్యలేదని పోలీసులు అన్నారు.
మైసూరు లేడీ టెక్కి కేసు పెట్టిన తరువాత మహేష్ మీద మరికొంత మంది మహిళలు కేసు పెట్టారని, నిత్య పెళ్లికొడుకు గురించి మొత్తం ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న మహేష్ నాయక్ ఇప్పటి వరకు 15 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడని వెలుగు చూడటం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. మహేష్ పెళ్లి చేసుకున్న వారిలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఉన్నారని తెలిసింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications