• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అనాలిసిస్: శివసేనతో కలిసి వెళ్లేందుకు కాంగ్రెస్ ఎన్సీపీలకు అడ్డుగా ఉన్నదేంటి..?

|

మరో మూడురోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఇంకా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఇక ఇప్పటికే బీజేపీ శివసేన మధ్య తలెత్తిన విబేధాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి పీటం చుట్టే రెండు పార్టీల రాజకీయం తిరుగుతోంది. శివసేన సీఎం పోస్టుపై క్లారిటీ ఇవ్వాలని కోరుతుంటే బీజేపీ మాత్రం పూర్తిగా ఐదేళ్లు తమ పార్టీనే సీఎం కుర్చీలో ఉంటుందని చెబుతోంది. ఈ క్రమంలోనే శివసేన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యసాధ్యాలపై చర్చించింది. అయితే తాము ప్రతిపక్షంలోనే ఉంటామని చెప్పారు శరద్ పవార్. అంతకుముందు కూడా ఎన్సీపీ మిత్రపక్షం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కూడా మహారాష్ట్ర రాజకీయ పరిస్థితిపై చర్చించారు. అయితే కాంగ్రెస్ ఎన్సీపీలు తమ ఖాతాలో ఓ రాష్ట్రంను వేసుకునే గోల్డెన్ ఛాన్స్ వచ్చినప్పటికీ ఎందుకు వదులుకుంది..?

 గత అనుభవాలు పాఠాలు నేర్పాయా..?

గత అనుభవాలు పాఠాలు నేర్పాయా..?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ శివసేనలు కలిసి పోటీచేశాయి. ఇక ఎన్సీపీ కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేశాయి. అయితే ఏ పార్టీకి విడివిడిగా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మరో పార్టీ మద్దతు తప్పనిసరిగా మారింది. అయితే ముందస్తు పొత్తులో భాగంగా బీజేపీకి శివసేన మద్దతుగా నిలిచి ప్రభుత్వం ఏర్పాటులో సహకరిస్తుందనుకుంటే ముఖ్యమంత్రి పదవిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుపట్టింది. ఇక తప్పని పరిస్థితుల్లో శరద్ పవార్ తలుపు కొట్టగా వారి విజ్ఞప్తిని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి చేరవేశారు. అయితే వచ్చిన అవకాశాన్ని సోనియాగాంధీ వద్దనుకున్నట్లు సమాచారం. దీని వెనక చాలా కారణాలతో పాటు గత అనుభవాలు కూడా ఉన్నాయి.

 కళ్ల ముందు ఇంకా కనిపిస్తున్న కర్నాటకీయం

కళ్ల ముందు ఇంకా కనిపిస్తున్న కర్నాటకీయం

మే 2018లో కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో తెలిసిందే. అత్యధిక సీట్లు గెల్చుకున్న సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో కాంగ్రెస్ జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కచ్చితంగా ఒక్క సంవత్సరంలోనే కుమారస్వామి ప్రభుత్వం కూలడం ఆపై యడియూరప్ప సీఎం అవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని కాంగ్రెస్ అధినేత్రి అంచనా వేసినట్లు సమాచారం. బీజేపీకి అధికారం దక్కకుండా చేయాలని భావించిన కాంగ్రెస్ జేడీఎస్‌తో జతకట్టగా రెండు పార్టీల నుంచి ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూడటం, నిత్యం రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు గొడవపడుతుండటంతో కుమారస్వామి తన సీటును కాపాడుకోవడంలో విఫలమయ్యారు.

డిమాండ్ల సాధన కోసమే శివసేన డ్రామా..?

డిమాండ్ల సాధన కోసమే శివసేన డ్రామా..?

ఇక కర్నాటకలోని పరిస్థితులు ఇంకా తమ కళ్లముందు తిరుగుతూనే ఉన్నాయని సోనియాగాంధీ సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీలు, శివసేన తమతో కలవడం వెనక బలమైన కారణం ఉందని భావిస్తున్నాయి. శివసేన నిజమైన ఉద్దేశం ఏంటో కాంగ్రెస్‌ ఎన్సీపీలకు అర్థం కావడంలేదు. అంటే తమ డిమాండ్లను బీజేపీ నుంచి నెగ్గించుకునేందుకు ఎన్సీపీ కాంగ్రెస్‌ మద్దతుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బెదిరించి వారు కావాలనుకున్న పదవులకు బీజేపీ ఓకే చెబితే ఎన్సీపీ-కాంగ్రెస్‌లకు శివసేన హ్యాండిస్తుందనే అనుమానం కాంగ్రెస్‌కు ఉంది. బీజేపీతో విడిపోతున్నామని చెప్పకుండానే శివసేన ఎన్సీపీ-కాంగ్రెస్‌ పార్టీలతో చర్చలకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 శివసేనతో కలిస్తే కాంగ్రెస్‌కు మొదటికే మోసం..?

శివసేనతో కలిస్తే కాంగ్రెస్‌కు మొదటికే మోసం..?

శివసేన హిందూత్వ పార్టీ. ఆ పార్టీ ఎజెండానే హిందూత్వం. అందుకే అదే లైన్‌లో ఉన్న బీజేపీతో తప్ప మరే ఇతర పార్టీతో కలవదు. ఇదే ఎన్సీపీ-కాంగ్రెస్‌లకు అడ్డంకిగా మారిందనే మాట కూడా వినిపిస్తోంది. ఇక బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ, ఎల్‌జేపీ, శిరోమణి అకాలీదల్ పార్టీలు హిందుత్వ రాజకీయాలకు దూరంగానే ఉంటాయి. ఒకవేళ నిజంగానే శివసేనతో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. లేదా బయటనుంచి మద్దతు ఇచ్చినా భవిష్యత్తులో కాంగ్రెస్‌కు కష్టకాలం తప్పదనే భావనలో సోనియాగాంధీ ఉన్నట్లు సమాచారం. ఇక హిందీ ప్రధాన రాష్ట్రాతో పాటు కర్నాటకలోని ముస్లిం ఓట్లను తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. ఒకవేళ శివసేనతో జతకడితే అసలుకే మోసం వస్తుందనే భావనలో కాంగ్రెస్‌ ఉంది.

 బీజేపీతో పవార్ కలిస్తే....

బీజేపీతో పవార్ కలిస్తే....

ఇక కాంగ్రెస్‌తో పోలిస్తే శరద్ పవార్ తన మరాఠా కార్డును ఇక్కడ ప్రదర్శించే అవకాశం ఉంది. మరాఠాల కోసం లేదా మహారాష్ట్ర స్థిరత్వం కోసం తాను బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటించొచ్చు. ఆ స్వేచ్ఛ తనకు ఉంది. అయితే బీజేపీతో ఎన్సీపీ కలవదనేది బల్లగుద్ది చెబుతున్నారు మరాఠా ప్రజలు. ఒకవేళ వారి అభీష్టం మేరకు బీజేపీతో శరద్ పవార్ కలిస్తే అతని పార్టీకి భవిష్యత్తు ఉండదనేది విశ్లేషకుల అభిప్రాయం.

మరోవైపు కాంగ్రెస్ మద్దతు లేకుండా శివసేనతో ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మహారాష్ట్రలో బీజేపేతర ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదనేది స్పష్టమవుతోంది. ఒక వేళ కాంగ్రెస్ ఏదైనా అడుగు ముందుకు వేస్తే తప్ప మహారాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాదు. అది ఎలాగూ జరగదు కాబట్టి బీజేపీ శివసేనలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అందుకే మహారాష్ట్ర ప్రజలు శివసేన బీజేపీలకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని ప్రజల అభీష్టం మేరకు రెండు కాషాయ పార్టీలు కలిపి ప్రభుత్వంఏర్పాటు చేయాలని మీడియా సమావేశంలో చెప్పారు.

English summary
The Shiv Sena is eager to form government in Maharashtra with or without the BJP. It has reached out to NCP-Congress alliance but Sharad Pawar and, more importantly, Sonia Gandhi have not yet committed themselves to Uddhav Thackeray's party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X