ఆజాద్ బాటలో మరో కాంగ్రెస్ సీనియర్ - సోనియా క్యాంపులో కలకలం..!!
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఆరంభమైంది. సుమారు నెల రోజుల పాటు ఇది కొనసాగుతుంది. సోనియా గాంధీ- ప్రస్తుతం ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రిగా వ్యవహరిస్తోన్నారు. ఆమె స్థానంలో పూర్తిస్థాయిలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ పదవి కోసం రాహుల్ గాంధీ రేసులో నుంచి దాదాపు తప్పుకొన్నట్టే. దీనితో ఏఐసీసీ అధ్యక్ష పదవికి గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడిని ఎన్నుకోవడం దాదాపు ఖాయమైంది.

ఆనంద్ శర్మ రాజీనామా..
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతోన్న వేళ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ.. తన పదవికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఆయన ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆనంద్ శర్మను నియమిస్తూ ఈ ఏప్రిల్‌లో ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు నెలల తరువాత ఆయన ఈ పదవికి గుడ్‌బై చెప్పారు. తన వరకు ఆత్మాభిమానం అవసరమని, దానితో రాజీపడలేనని వ్యాఖ్యానించారు.

అసంతృప్తికి..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరు. కాంగ్రెస్ గ్రూప్- 23లో ఒకరు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులను తీసుకుని రావాల్సిన అవసరం ఉందంటూ కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తోన్నారు. చాలాకాలంగా అదిష్టానం వైఖరిపై అసంతృప్తితో ఉంటోన్నారు. ఇప్పుడు తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి, ఆ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసినట్టయింది. ఆత్మాభిమానంతో రాజీపడలేనని ఆయన చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల వేళ..
ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆనంద్ శర్మ తప్పుకోవడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. మొన్నటికి మొన్న మరో సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్.. తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఆయన రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్లు చెప్పారు. తనను నియమించిన కొన్ని గంటల్లోనే తప్పుకొన్నారు. ఇప్పుడు ఆనంద్ శర్మ కూడా అదే బాట పట్టడం చర్చనీయాంశమైంది.

జీ23 నుంచి..
కొద్దిరోజుల వ్యవధిలో జీ23కి చెందిన సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ తమ పదవులకు రాజీనామాలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఇక ఆజాద్ తరహాలోనే ఆనంద్ శర్మ కూడా పార్టీకి పూర్తిస్థాయిలో దూరమౌతారనే ప్రచారం కూడా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికలకు ఏఐసీసీ సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ పరిణామాల పట్ల కలవరపడుతోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications