ఎదురుతన్నిన ఎగ్జిట్ పోల్స్ - లైవ్ లోనే ఎడ్చేసిన జాతీయ ఛానల్ యాంకర్..!
ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తాజాగా పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఇందులో జాతీయ స్దాయిలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థలు తేల్చేశాయి. అలాగే మిత్రపక్షాలతో సంబంధం లేకుండానే బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధిస్తుందని తేల్చాయి. అలాగే ఒడిశాలోనూ హంగ్ అసెంబ్లీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి.
కానీ ఇవాళ వెలువడుతున్న ఫలితాల్లో ఇవన్నీ తప్పని తేలిపోయింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి మ్యాజిక్ మార్క్ అయిన 272 సీట్లను దాటి స్వల్ప మెజార్టీ మాత్రమే సాధించింది. అంత కాదు విపక్ష ఇండీ కూటమికి 160 సీట్లలోపే వస్తాయని జాతీయ మీడియా ఛానళ్లు చేసిన ఎగ్జిట్ పోల్స్ తప్పని నిరూపణ అయింది. ఇండీ కూటమి దాదాపు 230 సీట్లకు దూసుకెళ్లింది. దీంతో ఓ జాతీయ మీడియా ఛానల్ లైవ్ లోనే వీటిని వివరిస్తూ ఏడ్చేశాడు.

🥺🥺🥺🥺 pic.twitter.com/LHE69xKJtq
— Akshita Nandagopal (@Akshita_N) June 4, 2024
జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే యాంకర్ కమ్ ప్రెజెంటర్ అయిన ప్రదీప్ గుప్తా తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించారు. వాటితో ఇవాళ వెలువడుతున్న వాస్తవ ఫలితాలను పోల్చే సందర్భంలో ఆయన ఒక్కసారిగా కుంగిపోయారు. లైవ్ లోనే బోరున ఏడ్చేశారు. దీంతో ఆయనతో పాటు ఉన్న యాంకర్లు ప్రదీప్ గుప్తాను ఊరడించాల్సి వచ్చింది. చివరికి ఆయన శాంతించడంతో లైవ్ కొనసాగింది.












Click it and Unblock the Notifications