• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎర్రచందనం స్మగ్లింగ్: లేడి డాన్ ఎక్కడ?

|

చిత్తూరు/తిరుపతి/బెంగళూరు: తిరుపతి సమీపంలోని బాకరాపేట నుండి బెంగళూరు మీదుగా మంగళూరు హార్బర్ కు దర్జాగా ఎర్రచందనం రవాణా అవుతూ వచ్చేది.శేషాచలం అడువుల్లో ఎన్ కౌంటర్ జరగడం, 20 మంది తమిళనాడు కూలీలు అంతం కావడంతో ఇంత కాలం ఎర్ర చందనం తరలిస్తున్న స్మగ్లర్లు అదృశ్యమయ్యారు.

తిరుపతి సమీపంలోని శేషాచలం అడువుల్లో నుండి ఎర్రచందనం తీసుకు వచ్చిన తరువాత ఆ దుంగలను ఒక గోదాములో దాచిపెడుతూ వచ్చేవారు. తరువాత వారంలో మూడు రోజులు రాత్రి పూట పెట్రోల్ తో వేగంగా నడిచే వాహనాలలో (కర్ణాటక నెంబర్ వాహనాలు)లలో ఎర్రచందనం దుంగలు వేస్తూ వచ్చేవారు.

పీలేరు, కలికిరి, వాయల్పాడు వరకు రెండు టీంల సభ్యులు ఎర్రచందనం ఉన్న వాహనాలు దాటిస్తూ వచ్చారు. నిత్యం పోలీసులు గస్తీ తిరిగే మదనపల్లెలో రెండు ప్రత్యేక టీంలు ఉన్నాయి. తిరుపతి రోడ్డు దగ్గర ఒక టీం, అనంతపురం రోడ్డు దగ్గర ఒక టీం ఉంటుంది.

Andhra Pradesh police task force keen on Lady Don

పోలీసులు లేని సమయం గుర్తించి ఎర్రచందనం తీసుకు వస్తున్న వారికి సమాచారం ఇస్తారు. వెంటనే వారు బైపాస్ రోడ్డు మీదుగా బెంగళూరు రోడ్డు చేరుకుంటారు. అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు లోని చీకలబైలు చెక్ పోస్టు దగ్గరకు తీసుకు వచ్చి వదులుతారు.

ముందుగానే బేరం కుదుర్చుకొవడంతో చెక్ పోస్టు సిబ్బంది ఆ వాహనాలను వదిలిపెట్టేవారనే ఆరోపణలు ఉన్నాయి. చెక్ పోస్టు దాటిన తరువాత అటవీ ప్రాంతం వస్తుంది. అక్కడ అప్పటికే సిద్దంగా ఉన్న కర్ణాటక టీం ఆ వాహనాలు పోలీసుల కంట పడకుండ పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఒక్క వాహనం సురక్షితంగా తరలిస్తే వీరికి రూ. 5 వేల నుండి రూ. 7 వేల వరకు గిట్టుబాటు అవుతుంది.

కర్ణాటక లేడి డాన్ ఎక్కడ..............!

చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రాజకీయ నాయకుడి అండతో కర్ణాటకలోని కోలారు జిల్లాకు చెందిన ఒక లేడి గత 15 సంవత్సరాల నుండి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నది. ఆమెను చిత్తూరు అటవీ శాఖ అధికారులు అనేక సార్లు అరెస్టు చెయ్యడానికి విఫలయత్నం చేశారు.

అయితే ఆమె ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం, నిత్యం 15 మంది దాక చుట్టూ అనుచరులు ఉండటంతో అరెస్టు చెయ్యలేకపోయారు. తిరుపతి నుండి వచ్చే ఎర్రచందనం ఈమె కోలారు, చిక్కబళ్లాపురలోని తన అనుచరులకు చెందిన తోటలలో నిల్వ చేస్తూ వచ్చేది

తరువాత సమయంలో చూసి దేవనహళ్ళి రింగ్ రోడ్డు, దోడ్డబళ్లాపుర, తుమకూరు రోడ్డు మీదుగా మంగళూరు హార్బర్ తరలించడానికి ఈమె అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చేది. చాల సందర్బాలలో మంగళూరుకు ఖాళీగా వెళుతున్న పెట్రోల్, డీజల్ ట్యాంకులలో ఎర్రచందనం దుంగలు తరలించారు.

చాల వరకు బెంగళూరులోని వ్యాపారులు ఈమె దగ్గర ఒక కేజీ ఎర్రచందనం రూ. 3 వేల నుండి రూ. 5 వేల వరకూ కొనుగోలు చేశారని చాలసార్లు వెలుగు చూసింది. ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సమయంలో లేడి డాన్ తన కార్యకలాపాలు తగ్గించుకున్నట్లు ప్రచారం సాగుతోంది శేషాచలం అడవుల్లో 20 మంది తమిళ కూలీలు ఎన్ కౌంటర్ కావడంతో లేడి డాన్ తో పాటు ఆమె అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Andhra Pradesh police task force shot dead 20 red sander smugglers during wee hours in the Sesachalam forests near Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more