Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందరికి అక్కా అని చెప్పి ఎంజాయ్, గోవా ప్రియుడి చేతిలో అంగన్ వాడి టీచర్ కథ !

బెంగళూరు/మైసూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కొన్ని సంవత్సరాలు కాపురం చేసింది. సోషల్ మీడియాలో ఎక్కువగా కాలం గడుపుతున్న మహిళకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యారు. ఛీ అంటూ భర్త అతని భార్యను వదిలేశాడు. భర్తను వదిలేసిన భార్య గోవా ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేసింది. అందరికి ప్రియుడిని తమ్ముడు అని పరిచయం చేసింది. అదే గోవా ప్రియుడి చేతిలో అంగన్ వాడి టీచర్ హత్యకు గురికావడం కలకలం రేపింది.

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని పాండవపుర తాలుకాలోని కెరతణ్ణూరు గ్రామంలో మమత అనే మహిళ నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రమేష్ అనే వ్యక్తితో మమత పెళ్లి జరిగింది. కొంతకాలం భర్త రమేష్ తో కాపురం చేసిన మమత తరువాత రూట్ మార్చింది. నిత్యం స్మార్ట్ ఫోన్ లో కాలం గడుపుతున్న మమత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ బాయ్ ఫ్రెండ్స్ తో ఎక్కువగా టచ్ లో ఉండటం మొదలుపెట్టింది.

 love-affair

రమేష్ అతని భార్య మమతకు పద్దతి మార్చుకోవాలని చాలాసార్లు హెచ్చరించాడు. అయితే మమతా మాత్రం పద్దతి మార్చుకోలేదని తెలిసింది. సహనం కోల్పోయిన రమేష్ అతని భార్య మమతను వదిలేశాడు. భర్త రమేష్ ను వదిలేసిన మమత మైసూరు తాలుకాలోని సిద్దలింగాపురంలో అంగన్ వాడి టీచర్ గా ఉద్యోగంలో చేరింది.

భర్తకు దూకంగా ఉంటున్న మమతకు గోవాలో సొంతంగా బేకరి పెట్టుకుని వ్యాపారం చేస్తున్న మోహన్ కుమార్ అనే యువకుడు సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. భర్తకు దూరంగా ఉంటున్న మమత రెండుసార్లు గోవాకు వెళ్లి ఆమె ప్రియుడు మోహన్ కుమార్ తో ఎంజాయ్ చేసింది. తరువాత మోహన్ కుమార్, మమత అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు.

 love-affair

గోవాలో బేకరి అమ్మేసి మైసూరుకు వచ్చి బేకరి పెట్టాలని మమత ఆమె ప్రియుడు మోహన్ కుమార్ కు చెప్పింది. ప్రియురాలు కోరిక మేరకు మోహన్ కుమార్ మైసూరు తాలుకాలోని సిద్దలింగాపురలో బేకరి పెట్టాడు. ప్రియుడు మోహన్ కుమార్ బేకరి పెట్టడానికి మమత ఆరు లక్షల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం చేసింది.

ప్రియుడు మోహన్ కుమార్ తన తమ్ముడు అని మమత అందరికి పరిచయం చేసింది. బేకరికి వస్తున్న వాళ్లకు మమత తన అక్క అని మోహన్ కుమార్ పరిచయం చేశాడు. అక్కాతమ్ముడు అని అందరికి చెప్పుకుంటూ అక్రమ సంబంధం పెట్టుకున్న మమత, మోహన్ కుమార్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు.

body

శుక్రవారం రాత్రి మమత ప్రియుడు మోహన్ కుమార్ బేకరి దగ్గరకు వెళ్లింది. తరువాత డబ్బులు విషయంలో మోహన్ కుమార్, మమతల మధ్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన మోహన్ కుమార్ బేకరిలో ఉన్న ఇనుప రాడ్ తీసుకుని మమత తల మీద దాడి చెయ్యడంతో ఆమె స్పాట్ లో చనిపోయింది. అర్దరాత్రి మమత శవాన్ని బేకరి నుంచి తరలించడానికి మోహన్ కుమార్ ప్రయత్నించడంతో స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మమతకు, తనకు అక్రమ సంబంధం ఉందని మోహన్ కుమార్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. బేకరి పెట్టడానికి తన ప్రియురాలు మమత తనకు రూ. 6 లక్షలు ఇచ్చిందని, డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చెయ్యడంతో గొడవ జరిగిందని, ఇనుపరాడ్ తో దాడి చేస్తే ఆమె ప్రాణాలు పోయాయని, తాను మమతను హత్య చెయ్యాలని అనుకోలేదని మోహన్ కుమార్ అంటున్నాడని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+