వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. ప్రియుడు భార్య, ఏడేళ్ల కూతురిని... కత్తితో పొడిచి....
అమృత్‌సర్ : వారిద్దరికీ పెళ్లయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ వారి బుద్ధి తప్పింది. పెళ్లై భార్య, భర్త, పిల్లలు ఉన్న వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈ విషయం అతని భార్యకు తెలిసి రగిలిపోయింది. భర్తతో వాదించింది. ఆమెతో ఎడమొహం పెడమొహంగా ఉంటోంది. తమ అక్రమ బంధానికి అడ్డొస్తున్నారనే నెపంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కోపం నశాళానికి ఎక్కింది. తనకు అడ్డుగా ఉన్న ప్రియుడి భార్యను మట్టుబెట్టాలనుకొంది. అందుకోసం ప్రణాళిక రచించి .. అమలు కూడా చేసింది.

రెండు కుటుంబాల్లో ..
అమృత్‌సర్ ప్రీత్‌నగర్‌లో కమలేశ్ రాణి ఉంటుంది. ఈమెకు భర్త రామ్, ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. సొంత ఇల్లు ఉండటంతో సంసారం సాఫీగా సాగిపోతుంది. అయితే వారి ఇంట్లో అద్దెకు ఉండేందుకు దేవ్ ఆనంద్ రాయ్ వచ్చాడు. ఇతను ఇండో టిబెటన్ సరిహద్దులో పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పాటియాలాలో పనిచేస్తున్నారు అతనికి కూడా పెళ్లయింది. ఏడేళ్ల కూతురు కూడా ఉంది. అయితే దేవ్, రాణి మధ్య అతి చనువు వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి దేవ్ భార్య సుమన్ .. హెచ్చరించింది. దీంతో దేవ్ కాస్త దూరంగానే ఉంటున్నారు. దీంతో రాణికి అనుమానం వచ్చింది.

పరిచయం కాస్త ..
అంతకుముందు రాణి, సుమన్ మాట్లాడుకునే వారు. కానీ ఈ మధ్య మాటలు లేకుండా పోయాయి. ఈ క్రమంలో ఏం చేయాలని ఆలోచించింది రాణి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న సుమన్‌ను తొలగించుకోవాలని భావించింది. పక్కా ప్రణాళికతో నిన్న రాత్రి సుమన్ ఇంట్లోకి వెళ్లిపోయింది. వెంట వెళ్లేప్పుడు పదునైన కత్తి కూడా తీసుకెళ్లింది. మమూలుగా మాటలు కలిపి .. దేవ్ విషయం తీసింది. దీంతో వారి మధ్య మాటా మాటా పెరిగింది. అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తి తీసి .. సుమన్‌పై దాడిచేసింది. దీంతో ఆమె అరిచింది. అక్కడే ఉన్న ఏడేళ్ల కూతురు ఏం చేయొద్దని కోరింది. కానీ ముందు సుమన్, తర్వాత చిన్నారిపై దాడి చేసింది రాణి. తర్వాత వారిద్దరి మృతదేహాలను తీసుకొని ఆటోరిక్షాలో తరలించింది. అమృత్‌సర్ చెరువులో వారిద్దరి మృతదేహాలను పడేసింది.

హతమార్చి ..
తర్వాత రాణి .. రైల్వేస్టేషన్ వెళ్లిపోయింది. తన ముగ్గురు పిల్లలను తీసుకొని రావడంతో భర్త రామ్‌కు అనుమానం వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమన్ ఆమె కూతురును మట్టుబెట్టిన రాణిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ హత్యలపై విచారిస్తున్నామని పేర్కొన్నారు. రాణికి సాయం చేసిన ఆటో రిక్షా డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. సుమన్ భర్త, రాణి లవర్ దేవ్ ఆనంద్ రాయ్ ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications