రాహుల్ గాంధీకి ఝలక్: పోటీకి దిగిన సీపీఐ: బరిలో డీ రాజా భార్య
Wayanad Lok Sabha: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో- ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా బ్లాక్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చిన షాక్‌కు తేరుకోకపోతున్న కాంగ్రెస్‌కు మరో ఝలక్ తగిలింది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో తాము పోటీ చేయనున్నట్లు సీపీఐ ప్రకటించింది. అక్కడితో ఆగలేదు. ఓ అడుగు ముందుకేసింది. అభ్యర్థి పేరును సైతం వెల్లడించింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా భార్య అన్ని రాజా ఇక్కడ పోటీ చేయనున్నట్లు తెలిపింది.

అన్ని రాజా.. ప్రస్తుతం భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా పని చేస్తోన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తోన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వాయనాడ్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త డీ రాజా స్వయంగా వెల్లడించారు.
తిరువనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా పన్నియన్ రవీంద్రన్ పోటీ చేయనున్నారు సీపీఐ అభ్యర్థిగా. మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న కేరళలో.. నాలుగు చోట్ల నుంచి తాము పోటీ చేయనున్నట్లు ఇదివరకే సీపీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వాయనాడ్, తిరువనంతపురం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
వాయనాడ్ నుంచి అన్ని రాజా, తిరువనంతపురం నుంచి రవీంద్రన్ అభ్యర్థిత్వం ఖరారైంది. మరో రెండు స్థానాలకు అభ్యర్థులను సీపీఐ ఖరారు చేయాల్సి ఉంది. వాయనాడ్, తిరువనంతపురం లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి, శశిథరూర్.. తిరువనంతపురం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications