షాక్: కొడనాడు ఏస్టేట్ అకౌంటెంట్ దినేష్ ఆత్మహత్య
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఏస్టేట్ కు చెందిన అకౌంటెంట్ దినేష్ కుమార్ సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొత్తగిరిలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకొన్నాడు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఏస్టేట్ కు చెందిన అకౌంటెంట్ దినేష్ కుమార్ సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొత్తగిరిలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకొన్నాడు.
దీంతో కొడనాడు ఏస్టేట్ కు చెందిన అనుమానాస్పద మృతుల సంఖ్య నాలుగుకుచేరింది. రెండు నెలల క్రితమే కొడనాడు ఏస్టేట్ లో ఓ సెక్యూరిటీ గార్డును దుండగులు హత్య చేశారు.
జయ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు చోరిచేయడానికి వచ్చిన వారు ఆ సిబ్బందిని హతమార్చారు.అయితే తర్వాత వీరిలో ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో వ్యక్తి కూడ రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య, కుమార్తె చనిపోయారు.

తాజాగా జయ కొడనాడు ఏస్టేట్ లో పనిచేస్తున్న ముగ్గురు అకౌంట్టలలో ఒకరైన దినేష్ కుమార్ సోమవారం నాడు ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయాడు. పోలీసులు మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం కొత్తగిరి ఆసుపత్రికి తరలించారు. మంగళవారం నాడు మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించనున్నారు. ఎస్టేట్ లోని ఇతర ఉద్యోగులు కలిసి రెండు రోజుల క్రితమే తమను ఉద్యోగాల నుండి తొలగిస్తారేమోననే ఆందోళన చెందారని సమాచారం.
ఏస్టేమ్ మేనేజ్ మెంట్ లో మార్పులు చోటుచేసుకొంటున్నట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే దినేష్ మృతి వెనుక కుటుంబపరమైన వివాదాలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications