Cheeta: కూనో నేషనల్ పార్కులో మరో చిరుత మృతి..

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు ఎదురు దెబ్బులు తగులతూనే ఉన్నాయి. తాజాగా మరో చీతా మృతి చెందింది. మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో నేషనల్ పార్క్ లో రెండు నెలల వయసున్న చీతా కూన (ఆడ చిరుత పిల్ల) మరణించింది. నమీబియా నుంచి తెచ్చిన జ్వాల అనే ఆడ చీతా (జ్వాల)కు ఈ ఏడాది మార్చ్ నెలలో నాలుగు కూనలు పుట్టాయి. అయితే వీటిలో ఒకటి మంగళవారం (మే 23న) మృతి చెందిందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

దీంతో ప్రస్తుతం పార్కులో పిల్లల సంఖ్య మూడుకు తగ్గింది. చీతా కూన మృతికి కారణాలు ఇంకా తెలియలేదన్నారు. ఇప్పటికే ఈ నేషనల్ పార్క్ లో మూడు చీతాల మరణంతో తలలు పట్టుకుంటున్న అటవీశాఖ అధికారులకు ఈ పిల్ల చీతా మృతి మరో సమస్య తెచ్చిపెట్టింది. అంతకు ముందు కూడా చిరుతలు చనిపోయాయి. కునో నేషనల్ పార్క్ లో ఉదయ్, సాషా, దక్ష మృతి చెందాయి.

Another leopard

ఇప్పుడు మరో పులి పిల్ల చనిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కునో మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ తీరుపైనా, సమర్థత పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ జంతువుల కన్సర్వేషన్ ప్రాజెక్టులో లోపాలు ఉండవచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూనో నేషనల్ పార్క్ లో 17 చీతాలు, మూడు కూనలు ఉన్నాయి.

ఇంతకు ముందు కునో నేషనల్ పార్క్‌లో రెండో చిరుత మరణించిన తర్వాత, దక్షిణాఫ్రికా అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ ఈ తరహా ప్రాజెక్ట్‌లో పెద్ద పిల్లుల మరణాలు ఊహించిన మరణాల రేటులో ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమిబీయా నుంచి చిరుతలను భారతదేశానికి తీసుకువచ్చారు. 17 ఫిబ్రవరి 2023న సంతకం చేసిన సహకార ఒప్పందంలో దక్షిణాఫ్రికా 12 చిరుతలను భారత్ కు తీసుకొచ్చారు. అంతుకు ముందు నమిబియా నుంచి చిరుతలు తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+