అమ్మాయికి ప్రియుడు యాసిడ్ తాగించాడు

జితేంద్ర సక్పాల్ అనే ఆ వ్యక్తితో ఆ అమ్మాయికి గతంలో సంబంధం ఉంది. ఆమె అతన్ని కలిసినప్పుడు అతను ఆ దారుణానికి ఒడిగట్టాడు. గతంలో అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఇద్దరు విడిపోయారు. ఇరువురు కూడా ముంబైలోని దహిషార్ ప్రాంతంలో ఉంటారు.
శనివారంనాడు అమ్మాయి సక్పాల్‌ను కలవడానికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె చేత అతను బలవంతంగా యాసిడ్ తాగించాడు. ఆ తర్వాత సముద్రంలోకి తోసేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సక్పాల్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తమ అమ్మాయి వెంట పడుతున్నాడని గతంలో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అతన్ని హెచ్చరించారు కూడా.












Click it and Unblock the Notifications