వందే భారత్ రైళ్ళలో మరో కొత్త సౌకర్యం.. ప్రయాణికులకు ఫుడ్ ఫెస్టివల్!

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ముఖ్యంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను తీసుకువచ్చిన తర్వాత రైళ్లలో అధునాతన వసతులు కల్పించడం పైన మరింత ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం మన దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు విపరీతమైన ఆదరణ ఉంటుంది.

వందే భారత్ రైళ్ళలో కొత్త సదుపాయం
సుదూర ప్రాంతాలకు అత్యంత వేగంగా తీసుకువెళ్లే వందే భారత్ రైళ్లలో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రయాణికులు చిన్నచిన్న ఇబ్బందులు కూడా పడకుండా ఉండాలని మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన భారతీయ రైల్వే రైలు ప్రయాణికుల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

Another new facility in Vande Bharat trains a festival for passengers

వందే భారత్ రైల్లో ఫుడ్ విషయంలో నిర్ణయం
సాధారణంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల టిక్కెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ అనేది ఆప్షనల్ గా అందులో ఉంటుంది. ఇక భోజనంతో కలిపి వందే భారత్ టికెట్ చార్జీలు వసూలు చేస్తారు. అయితే రైళ్లలో ఏదైనా ఇతర ఆహారం దొరుకుతుందన్న ఆలోచనతో చాలామంది టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆప్షన్ ను తొలగిస్తారు. ఇక వందే భారత్ రైళ్లలో పాంట్రీ నుంచి వచ్చే ఫుడ్ మినహాయించి ఇతర ఆహారం దొరకదు.

టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆప్షన్ లేకున్నా సరే
దీంతో రైల్ లో ఆహారం దొరకక ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే వందే భారత్ రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. టికెట్ బుక్ చేసేటప్పుడు ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా సరే రైలు ఎక్కిన తర్వాత ప్రయాణికుల కోసం కరెంట్ బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఐఆర్సిటిసికి రైల్వే బోర్డు లేఖ
అయితే ప్యాంట్రీలో ఆహారం ఎంత మేరకు అందుబాటులో ఉందనే విషయాన్ని బట్టి రైల్వే సిబ్బంది టికెట్ బుకింగ్ సమయంలో మీల్స్ ఆప్షన్ ఎంచుకోని వారికి ఆహారాన్ని అందిస్తారు. ఇక ఈ మేరకు ఐఆర్సిటిసికి రైల్వే బోర్డు లేఖ కూడా రాసింది. అంతేకాదు రైళ్లలో అందించే ఆహారం పరిశుభ్రంగాను, రుచికరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు ఐ ఆర్ సి టి సి కి సూచన చేసింది.

వందే భారత్ రైళ్ళలో ఇప్పటివరకు ఫుడ్ తిప్పలు
ఇక ఇదే సమయంలో రాత్రి 9 గంటల తరువాత రైలు ప్రయాణికులకు ట్రాలీల ద్వారా ఫుడ్ విక్రయాలు జరగకుండా చూడాలని కూడా సూచించింది. అయితే రైలు టికెట్లను కొనుగోలు చేసేటప్పుడు ఫుడ్ ఆప్షన్ ఎంచుకోని వారు రైలు ఎక్కిన తర్వాత డబ్బులు చెల్లించి ఫుడ్ కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ టికెట్ బుకింగ్ సమయంలో మీల్స్ ఆప్షన్ ఎంచుకున్న వారికే వందే భారత్ రైలులో ఆహారాన్ని అందిస్తారు.

కరెంట్ బుకింగ్ తో ఆహారాన్ని అందించాలని నిర్ణయం
దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా చాలామంది ప్రయాణికులు ఈ విషయాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్లగా తాజాగా భారతీయ రైల్వే మీల్స్ బుకింగ్, టికెట్ బుకింగ్ సమయంలో చేసుకోని వారికి కూడా కరెంట్ బుకింగ్ తో ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+