వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందే భారత్ రైలుపై ఎందుకింత ఆగ్రహం..?

|
Google Oneindia TeluguNews

పాట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో ఒకటి- వందే భారత్ ఎక్స్‌ప్రెస్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ రైలు దశలవారీగా అన్ని రాష్ట్రాల్లోనూ పట్టాలెక్కుతోంది. ఇప్పటివరకు ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆయా రాష్ట్రాల్లో పరుగులు తీస్తోన్నాయి. త్వరలో మరిన్ని అందుబాటులోకి రానున్నాయి.

సికింద్రాబాద్- విశాఖ మధ్య..

సికింద్రాబాద్- విశాఖ మధ్య..

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిదో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రధాని మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలుకు పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తోందీ రైలు. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటోంది. ఈ రైల్లో గరిష్ఠంగా ఎనిమిదిన్నర గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరుకోవచ్చు.

ప్రారంభానికి ముందే..

ప్రారంభానికి ముందే..

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందే ఈ రైలుపై రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నం కంచరపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దిలీప్, శంకర్, చందు అనే యువకులు మద్యం మత్తులో ఈ రైలుపై రాళ్లు విసిరినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంస నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.

బిహార్ లో..

బిహార్ లో..

ఇప్పుడు తాజాగా బిహార్ లో ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కిటీకీ అద్దాలు పగిలాయి. కతిహార్ జిల్లాలో ఈ ఘటన సంభవించింది. జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గల టెల్టా రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు- నంబర్ 22302 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కోచ్ కుడి వైపు కిటికీ అద్దాలు పగిలిపోయాయి.

ప్రయాణికుల ఫిర్యాదు..

ప్రయాణికుల ఫిర్యాదు..

కోచ్ నంబర్ సీ-6లో ప్రయాణిస్తోన్న వారు ఈ మేరకు ఎస్కార్ట్ పార్టీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దల్‌ ఖోలా స్టేషన్ దాటుకుని టెల్టాకు బయలుదేరిన కొద్ది నిమిషాలకే రాళ్లు విసిరినట్లు చెప్పారు. ఈ కోచ్ కుడి వైపు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని ఆర్పీఎఫ్ అధికారులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే దల్ ఖోలా స్టేషన్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు.

సీసీటీవీ ఫుటేజీ ద్వారా..

సీసీటీవీ ఫుటేజీ ద్వారా..

ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తోన్నామని కతిహార్ డివిజన్ సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ కమల్ సింగ్ తెలిపారు. రాళ్ల దాడి జరగడానికి గల కారణాలను అన్వేషిస్తోన్నామని చెప్పారు. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నామని అన్నారు.

చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీలో కీలక పదవి- ఆయనకు మించిన వారెవరు?చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీలో కీలక పదవి- ఆయనకు మించిన వారెవరు?

English summary
Another stone pelting incident on Vande Bharat Express train has been reported in Katihar of Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X