మాఫియా బెదిరింపులు: ప్రీతి, నెస్ కేసులో రోజుకో ట్విస్ట్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా, వ్యాపారవేత్త, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మరో సహ యజమాని నెస్ వాడియా మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా తమకు మాఫియా నుండి బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని నెస్ వాడియా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అండర్ వరల్డ్ నుండి తమకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని నెస్ వాడియా తండ్రి, వాడియా గ్రూప్ హెడ్ నస్లీ వాడియా పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాడియా గ్రూప్ పరువును దెబ్బతీస్తామని వారు హెచ్చరించినట్లుగా ఆరోపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాఫియా డాన్ రవి పుజారీ నుండి బెదిరింపులు వస్తున్నాయని నెస్ వాడియా తండ్రి జోషి మార్గ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం బెదిరింపు ఫోన్ వచ్చిందని, తర్వాత ఎస్సెమ్మెస్ వచ్చిందని ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా నస్లీ వాడియా వాంగ్లూలాన్ని పోలీసులు తీసుకోనున్నారు.

కాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై ప్రముఖ బాలీవుడ్ నటి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టయిన కింగ్స్ లెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింతా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదని ఆమె తరపు న్యాయవాది హితేష్ జైన్ పేర్కొన్న విషయం తెలిసిందే.
బహిరంగ ప్రదేశంలో ప్రీతి జింతాపై నెస్ వాడియా అసభ్య పదజాలం ఉపయోగించి అవమానపర్చాడని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ప్రీతి జింతా తన ఫిర్యాదులో లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎక్కవ చేయలేదని, బహిరంగంగా అసభ్యకరంగా దూషించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని న్యాయవాది హితేష్ తెలిపారు.
బహిరంగ ప్రదేశంలో అసభ్య పదజాలంతో దూషించడం కారణంగానే అవమానంగా భావించిన ప్రీతి జింతా ముంబైలోని మెరైన్ పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు నెస్ వాడియాపై ఐపిసి 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని చెప్పారు. ఆ సెక్షన్ కింద నమోదైన కేసు లైంగిక వేధింపుల కిందకు రాదని న్యాయవాది హితేష్ జైన్ పేర్కొన్నారు.
ఐపిఎల్-7లో ఓ పంజాబ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కుటుంబ సభ్యులతో వచ్చిన నెస్ వాడియా.. ప్రీతి జింతా, ఆమె స్నేహితులు, క్రికెటర్ల కుటుంబ సభ్యులు కూర్చున్న సీట్లను ఖాళీ చేయాలని ఆమెను కోరాడు. అయితే అప్పటికే ప్రీతి జింతా తన స్నేహితులతో కూర్చుని ఉండటంతో అందుకు నిరాకరించింది. దీంతో సహనం కోల్పోయిన వాడియాపై ప్రీతిపై పరుష పదజాలంతో దూషించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కన్నీరుపెట్టుకుంటూ ఐపిఎల్ ఛైర్మన్ రంజిబ్ బిస్వాల్‌కు ప్రీతి వివరించినట్లు తెలిసింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications