షీనా హత్య, ట్విస్ట్: పీటర్‌తో ఇంద్రాణి పరిచయం, పెళ్లి ఎలా?

ముంబై: షీనా బోరే హత్య నేపథ్యంలో ప్రముఖ రైటర్ సుహెల్ సేత్... పీటర్ ముఖర్జీకి, ఇంద్రాణికి ఎలా పరిచయం అయిందనే విషయాన్ని రాశారు. పదిహేనేళ్ల క్రితం నాటి విషయాలను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు.

ఇంద్రాణీ (పీటర్ ముఖర్జీకి, సుహెల్ సేత్‌కు) తమకు ఎలా, ఎప్పుడు పరిచయమైందో పేర్కొన్నారు. తాము లైబ్రరీ బార్‌లో డ్రింక్స్ తీసుకునే సమయంలో ఇంద్రాణి పరిచయమైందని చెప్పారు.

ఇంద్రాణి తమకు అలీక్వే పద్మాసీ ద్వారా పరిచయమైందని, తాము డ్రింక్స్ తీసుకునే సమయంలో అలీక్వే అందరికీ హలో చెప్పారని, ఆ సమయంలో.. అతనితో పాటు వచ్చిన ఇంద్రాణీ వద్ద చొరవ తీసుకొని తమతో జాయిన్ కావాలని కోరానని పేర్కొన్నారు.

Another twist in Sheena Bora murder case: Peter was introduced to Indrani by Aleque Padamsee

ఆ తర్వాత పరిచయం పెరిగిందని, అనంతరం పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. పీటర్ ముఖర్జీ స్టార్ నుంచి వెళ్లిపోయాక వారిద్దరు కలిసి సొంత మీడియా పెట్టుకున్నారని చెప్పారు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు తాను మాట్లాడలేదన్నారు.

కొన్నేళ్ల తర్వాత... తనకు ఫోన్ చేశారని,త తమ బిజినెస్ అమ్మేస్తామని, యునైటెడ్ కింగ్ డమ్‌కు వెళ్తామని, అక్కడే కూతురు విధి చదువుతుందని చెప్పారని తెలిపారు.

ప్రస్తుతం కూతురు షీనాను ఇంద్రాణి హత్య చేసినందనే విషయమై సుహెల్ షాక్ అయ్యారు. పీటర్ ముఖర్జీ మరింత షాక అయ్యారని, అయితే, వాస్తవం కోసం మనం నిరీక్షించాలని అభిప్రాయపడ్డారు.

కాగా, పీటర్ ముఖర్జీ భార్య ఇంద్రాణి కూతురు షీనా బోరేను హత్య చేసిన విషయమై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఇంద్రాణి స్టార్ ఇండియా మాజీ చీఫ్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆడిన అబద్ధం ఆమెను ఇప్పుడు జైలు గోడల మధ్యకు నెట్టిందని చెప్పవచ్చు. ముంబైలో 2012లో సంచలనం సృష్టించిన షీనా బోరా కేసు మిస్టరీ ఇప్పుడు వీడుతోంది.

షీనా బోరాను తొలుత ఇంద్రాణి సోదరి అని అందరు అనుకున్నారు. ఇంద్రాణి కూడా అలాగే అందరికీ పరిచయం చేసింది. పైగా షీనాను హత్య చేయడానికి వెనుక ఉన్న కారణం కూడా ఆస్తి వ్యవహారం కాదనీ, మరొకటని ఆమె భర్త పీటర్ ముఖార్జియా చెప్పడం గమనార్హం.

ఇంద్రాణి అరెస్టు, షీనా హత్య గురించి పీటర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలు షీనా బోరా తన కుమారుడితో ఎఫైర్ పెట్టుకున్నదనీ, ఐతే అది తమ ఇద్దరికీ ఇష్టం లేదని చెప్పాడు. ఐతే షీనా స్వయంగా తన భార్య ఇంద్రాణి కుమార్తె అని తనకు తెలియదనీ, ఆమె కూడా ఏనాడూ ఆమె తన కుమార్తె అని తనతో చెప్పలేదన్నారు.

ఐతే తాము వారిద్దరి ఎఫైర్‌ను అంగీకరించకపోయినప్పటికీ వారిరువురు తమతమ సంబంధాన్ని కొనసాగించారనీ, అది ఇంద్రాణికి పూర్తిగా ఇష్టం లేదని పీటర్ చెప్పారు. ఈ వ్యవహారంలో తనను ఇంతకాలం చీకట్లో ఉంచారని తనకు ఇప్పుడే అర్థమైందని పీటర్ వాపోయారు.

షీనా 2012 నుంచి కనిపించకపోవడంతో ఆమెను మర్చిపొమ్మని తన కుమారుడితో చెప్పానని చెప్పారు. ఐతే మరోసారి షీనా గురించి అడగ్గా ఆమె పైచదువుల కోసం అమెరికా వెళ్లినట్లు ఇంద్రాణి తనతో చెప్పిందనీ, దాంతో ఆ విషయాన్ని అంతటితో వదిలేసినట్లు చెప్పారు.

ఐతే అసలు నిజం తెలిసి తను దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. పీటర్ ఇంద్రాణిని 2002లో ఆమె స్టార్ ఇండియా నెట్‌వర్క్ హెచ్‌ఆర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న సమయంలో వివాహం చేసుకున్నారు. ఐతే అప్పటికే ఆమెకు పెళ్లయి షీనా బోరా జన్మించి ఉన్న సంగతి పీటర్‌కు తెలియదని అతడి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+