ఢిల్లీ పేలుడు మరో వీడియో విడుదల

Delhi Car Blast: దేశ రాజధాని ఢిల్లీని సోమవారం సాయంత్రం ఓ భారీ పేలుడు ఘటన కుదిపేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడు కారణంగా దాదాపు 9 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ గేట్ నంబర్-1 సమీపంలో జరిగిన కారు పేలుడుకు సంబంధించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

రెడ్ లైట్ వద్ద ఆగిన కారు
ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. పేలుడు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందు కారు కదలికలు కీలకంగా మారాయి. పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా మాట్లాడుతూ.. "సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో నెమ్మదిగా కదులుతున్న ఒక వాహనం రెడ్ లైట్ వద్ద ఆగింది. ఆ వాహనంలోనే పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి," అని తెలిపారు. కొత్తగా విడుదలైన వీడియోలో పేలుడు సమయంలో రహదారిపై ప్రజలు గుమిగూడి ఉండగా.. అకస్మాత్తుగా కారులో నుంచి ప్రకాశవంతమైన పసుపు కాంతి వచ్చి, ఆ తర్వాత పేలుడు సంభవించినట్లు కనిపిస్తోంది.

Another Video Emerges of Delhi Car Blast Near Red Fort Police Confirm New Leads

పేలుడు వెనుక కశ్మీరీ డాక్టర్ ఉమర్?
పేలుడు సంభవించిన హ్యుందాయ్ ఐ20 కారును కశ్మీరీ డాక్టర్ మహమ్మద్ ఉమర్ నడుపుతున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. పుల్వామాకు చెందిన ఉమర్‌కు ఇటీవల ఫరీదాబాద్‌లో భగ్నం చేయబడిన ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పేలుడుకు ముందు ఉమర్ కార్యకలాపాలను తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, పేలుడు జరిగిన కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో దరియాగంజ్ మార్కెట్ నుంచి శాంతివణ్ మార్గంలో ఎర్రకోట సమీపంలోని ఒక పార్కింగ్‌కు కారు చేరుకుంది. దాదాపు రెండు గంటల తర్వాత పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరి పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో యూ-టర్న్ తీసుకుని లోయర్ సుభాష్ మార్గ్ వైపు వెళ్లినట్లు రికార్డైంది.

ఎర్రకోట, మెట్రో స్టేషన్ మూసివేత
భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. చారిత్రక ఎర్రకోటను మూడు రోజుల పాటు పర్యాటకుల కోసం మూసివేశారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా భద్రతా కారణాల వల్ల వయొలెట్ లైన్‌లోని ఎర్రకోట మెట్రో స్టేషన్‌ను మూసివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+