గుడ్ న్యూస్: యాంటీ వైరల్ టీ షర్ట్, లోషన్.. ఇక వైరస్ మీ దరిచేరదు..
కరోనా.. కరోనా.. కరోనా... ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయం. ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చినా.. నోటికి మాస్క్, జేబులో శానిటైజర్ తప్పనిసరి. పని చేసుకొని ఇంటికి తిరిగొచ్చామో అంతే.. ఆ బట్టలు తీసి.. సర్ఫ్ నీటిలో నానబెట్టి.. వెంటనే స్నానం కూడా చేస్తుంటారు. అయితే ఇదీ పెద్ద పనీ.. అవసరం ఉన్నా ప్రతిసారీ ఇలా చేయడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిని గమనించిన ఐఐటీ ఢిల్లీ స్టార్టప్ సరికొత్త ఆవిష్కరణ చేపట్టింది. యాంటీ వైరల్ టీ షర్ట్, రక్షణ ఇచ్చే లోషన్ తయారు చేసింది. దీని ధర కూడా తక్కువలో ఉంటుందని ప్రతినిధులు చెబుతున్నారు.

యాంటీ వైరల్ టీ షర్ట్
ఢిల్లీ ఐఐటీకి చెందిన ఇ టెక్స్, కెన్ స్టా స్టార్టప్‌లు కలిసి చక్కని పరిష్కారం కనుగొన్నాయి. యాంటి వైరల్ టీ షర్ట్ రూపొందించాయి. ఇదీ ధరిస్తే వైరస్ దరిచేరదు. దీంతోపాటు ఇ టెక్స్ మాస్క్ కూడా తయారు చేసింది. ఇటు కెన్ స్టా లోషన్, శానిటైజర్ రూపొందించింది. ఈ నాలుగింటితో కలిసి కిట్ ఏర్పాటు చేశారు. శుక్రవారం కిట్‌ను ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రామ్ గోపాల్ రావు ఆవిష్కరించారు. వీరికి ఐఐటీ ఢిల్లీ రసాయన శాస్త్ర, జౌళి విభాగాలకు చెందిన నిపుణులు సహకరించారు.

30 సార్లు ఉతికిన ప్రభావం కోల్పోదు..
యాంటి వైరల్ టీ షర్ట్ 30 సార్లు ఉతికిన కూడా ప్రభావం కోల్పోదని నిపుణులు తెలిపారు. ఇక లోషన్‌లోని యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు 24 గంటల వరకు కరోనా వైరస్ నుంచి రక్షిస్తాయని తెలిపారు. దీంతో శానిటైజర్ వినియోగం తగ్గించొచ్చు అని ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. అంతేకాదు లోషన్ చేతులు, కాళ్లు, మొహానికి కూడా రాసుకోవచ్చని తెలిపారు. శానిటైజర్ కూడా మంచి ప్రభావం చూపిస్తోందని తెలిపారు. ఆల్కహాల్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోందని తెలిపారు.
Recommended Video

అందుబాటు ధరలో
టీ షర్ట్, లోషన్‌తో వైరస్‌ను జయించొచ్చు అని నిపుణులు తెలిపారు. ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుందని వివరించారు. వ్యాక్సిన్ వచ్చేలోపు టీ షర్ట్, లోషన్‌తో వైరస్ బరి నుంచి తప్పించుకోవచ్చు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications