వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్య: ప్లాన్ ప్రకారమే హత్య, ఫ్రెండ్‌పై అనుమానం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఇటీవల మహారాష్ట్రలోని ముంబైలో దారుణ హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంకు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య కేసులో చిక్కుముడి వీడుతున్నట్లుగా కనిపిస్తోంది. అనూహ్యను ఓ వ్యూహం ప్రకారం హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు సంబంధించి పోలీసులు ఆమె సన్నిహత స్నేహితుడు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అనూహ్య స్నేహితుడిగా భావిస్తున్న ఇరవై ఏళ్ల యువకుడిని విజయవాడలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని ముంబై పోలీసులకు అప్పగించారు. ముంబైకి వచ్చేందుకు జనవరి నాలుగున విజయవాడలో అనూహ్య ఎక్కిన రైలులోనే ఆ యువకుడు ప్రయాణించినట్లుగా ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇతను మరో బోగీలో ప్రయాణించినప్పటికీ ఇరువురు ఫోన్లో పలుసార్లు మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రయాణంలో వారు దాదాపు ముప్పావు గంట మాట్లాడుకున్నారు.

 Anuhya

ప్రేమ వ్యవహారం కోణంలో..!

అనూహ్య హత్యకేసులో కీలకాధారాలు సేకరించిన పోలీసులు ప్రేమ కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు. దర్యాప్తులో తమకు లభించిన ఆధారాలను బట్టి అనూహ్య హత్య ప్రణాళిక ప్రకారమే జరిగిందని, ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. ముంబై పోలీసుల అదుపులో ఉన్న సన్నిహిత స్నేహితుడు పైలట్ శిక్షణ పొందుతున్నాడట. ఆ ప్రెండ్ ప్రయాణం సమయంలో తాను ఎప్పుడూ వాడే ఫోన్ కాకుండా కొత్త నెంబర్ నుంచి ఆమెతో మాట్లాడటం గమనార్హం. అనూహ్య, అనుమానిత స్నేహితుడు మచిలీపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో సహధ్యాయులని సమాచారం.

అయితే, తను షిరిడికి వెళ్లానని, అనూహ్య హత్య విషయం తనకు తెలియదని యువకుడు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ముంబై మీదుగా షిరిడికి ఎందుకు వెళ్లాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా, అనూహ్య బ్యాగ్ తీసుకెళ్తూ సిసిటివి ఫుటేజీలో కనిపించిన వ్యక్తుల పోలీకలతో ఉన్న ఇద్దరిని కుర్లా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. వీరులో ఒకరు రైల్వే ఉద్యోగి, మరొకరి క్యాబ్ డ్రైవర్. ఆ తర్వాత వారిని విడిచిపెట్టారు. మరోవైపు అనూహ్య అత్యాచారానికి గురవ్వలేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దీనిని ముంబై పోలీసులకు అంద చేయాల్సి ఉంది.

మచిలీపట్నంకు ముంబై పోలీసులు

అనూహ్య కేసు విచారణ నిమిత్తం ముంబై పోలీసులు సోమవారం మచిలీపట్నంకు వచ్చారు. ఈ హత్య కేసుకు సంబంధించి అనూహ్య స్నేహితులు, బంధువుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.

English summary
One suspect has reportedly been detained from AP in the alleged murder case of software engineer Esther Anuhya, whose decomposed and burnt body was found in a swamp near a major highway on the outskirts of Mumbai on January 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X