వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్య కేసు: నిందితుడికి రేప్, హత్య ఉద్దేశం లేదట

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బందరు టెక్కీ ఈస్తర్ అనూహ్య హత్య కేసు నిందితుడు చంద్రభాన్ సనప్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. అతను విచారణలో చెప్పిన విషయాలపై మిడ్ డే ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. తనకు చోరీ ఉద్దేశం గానీ, అత్యాచారం చేసే ఉద్దేశం గానీ లేదని అతను చెప్పాడట. కేవలం ఆమె సంచీని, ల్యాప్‌టాప్‌ను ఎత్తుకుపోవాలని మాత్రమే అనుకున్నాడట.

అంధేరిలో ఆమెను దించుతాననే సాకుతో సంచీని ఎత్తుకెళ్లాలని చంద్రభాన్ సనప్ అనుకున్నాడట. అయితే, వాటిని కాపాడుకోవాలని అనూహ్య చేసిన ప్రయత్నం వల్ల ఆమెను బైక్‌పై తీసుకుని వెళ్లి అత్యాచారం చేయాలని అనుకున్నాడట. అనూహ్య తన వస్తువులను కాపాడుకోవాలనే ప్రయత్నం వల్ల హత్య చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడట.

Anuhya's killer had intended only to rob her bag, laptop

అనూహ్యను ఒప్పించే ప్రయత్నాలు సాగిస్తూ సనప్ ఆమె సంచీని తీసుకుని బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టుకున్నాడట. దాంతో అతను పారిపోతాడనే ఆందోళనతో అనూహ్య బైక్‌పై కూర్చుందట. దాంతో ఆమె శరీరాంగాలు తాకి అత్యాచారం చేయాలనే కోరిక పుట్టిందని సనప్ పోలీసులకు చెప్పాడట.

మీసం, గడ్డం తీయడానికి నిరాకరించాడు...

పోలీసులకు చిక్కిన తర్వాత మత కారణాలు చెప్పి గడ్డం, మీసం తీసేయడానికి చంద్రభాన్ సనప్ అంగీకరించలేదని చెబుతున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన కుర్లా ప్రభుత్వ రైల్వే స్టేషన్ పోలీసులు గడ్డం, మీసం తీసేయాలని అడిగితే వాటిని 11 ఏళ్ల పాటు పెంచుతానని దేవుడికి మొక్కుకున్నట్లు చెప్పాడట.

అతని మత విశ్వాసాలను దెబ్బ తీయడం ఇష్టం లేక వదిలేసి రోజూ పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పారట. కాల్ డిటైల్ రికార్డ్స్ ఆధారంగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. దేవుడికి మొక్కుకున్నానని చెప్పినప్పటికీ సిసిటివి కెమెరాలోని చిత్రంతో పోల్చుకోవడానికి బలవంతంగా గడ్డం, మీసం కొరిగించారట. నేరం చేసిన తర్వాత పది కిలోల బరువు కూడా తగ్గాడట

English summary
According to media report - Chandrabhan Sanap, the accused in the Esther murder case, has revealed that his original scheme only involved theft, not attempted rape or murder
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X