• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆంధ్ర‌ప్ర‌దేశ్: పెర‌గ‌నున్న‌ రేషన్‌ సరకుల ధ‌ర‌లు.. కందిపప్పుపై 67.5%, పంచదారపై 70% చొప్పున పెరుగుదల - ప్రెస్‌రివ్యూ

By BBC News తెలుగు
|
ప్రభుత్వ చౌక ధరల దుకాణము, రేషన్ షాపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాయితీపై రేషన్‌ అందుకుంటున్న కార్డుదారులు చెల్లించాల్సిన మొత్తం జులై నుంచి పెర‌గ‌బోతోంద‌ని ఈనాడు ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

కందిపప్పుపై 67.5%, పంచదారపై 70% చొప్పున ధరలు పెరగనున్నాయి. ఇంతకుముందు మార్కెట్లో ధర ఎంత ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ కిలో కందిపప్పును రూ.40, పంచదారను రూ.20 చొప్పున ఇచ్చేది.

ఇకపై మార్కెట్‌లో ధర ఎంతున్నా 25% రాయితీకే పరిమితం కావాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ధరలు పెరగనున్నాయి.

జులై నుంచే పెంచిన ధరల్ని అమలుచేయాలని.. కిలో కందిపప్పు రూ.67, పంచదార రూ.34 చొప్పున అమ్మాలని పౌర సరఫరాల శాఖ సూచించింది.

ఏడాదంతా ఇవే అమలైతే పేదలపై ఏడాదికి రూ.550.80 కోట్ల భారం పడనుంది. కందిపప్పు, పంచదార ధరల్ని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలోనే సమీక్షించింది. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా సవరించాలని, అప్పుడు ఉన్న ధరపై 25% రాయితీ ఇవ్వాలని ఫిబ్రవరిలోనే నిర్ణయించారు.

కార్యాల‌యాల‌కు రంగులు మార్చాలని పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పంచాయ‌తీ కార్యాల‌యాల‌పై రంగులు మార్చాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం

పంచాయతీ కార్యాలయాల రంగులపై జగన్‌ సర్కార్‌ వెనకడుగు వేసిందని ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

అన్ని కార్యాల‌యాల‌కు వెంట‌నే రంగులు మార్చాలని పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన‌ట్లు పేర్కొంది.

అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని.. సీఎం జగన్‌ బొమ్మ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలిచ్చింది. భవనాలపై ఉన్న నీలం, ఆకుపచ్చ రంగుల్ని వెంటనే తొలగించాలని ఆదేశాల్లో పేర్కొంది.

అయితే, జ‌గ‌న్ బొమ్మ వేయ‌డానికి కూడా వీల్లేద‌ని, దాన్ని కూడా తొల‌గించాల‌ని టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య సూచించారు. లేక‌పోతే మ‌ళ్లీ కోర్టు త‌లుపులు త‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని అన్నారు.

ఇది ప్రజాస్వామ్య విజయంగానే భావించాలని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అడ్రస్, వ్యక్తిగత వివరాల మార్పు, వేలిముద్రలు, ఐరిస్ అప్‌‌డేషన్ కోసం ఇక నుంచి రూ. 100 ఇవ్వాల్సి ఉంటుంది

ఆధార్‌‌ మార్పులకు రూ. 100

ఆధార్ ఎన్‌‌రోల్మెంట్ చార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెలుగు దినప‌త్రిక ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

ఆధార్‌‌కు సంబంధించి అడ్రస్, వ్యక్తిగత వివరాల మార్పు, వేలిముద్రలు, ఐరిస్ అప్‌‌డేషన్ కోసం ఇక నుంచి రూ. 100 ఇవ్వాల్సి ఉంటుందని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్​ఇండియా(యూఐడీఏఐ) వెల్లడించింది.

వివరాల మార్పు మాత్రమే అయితే రూ.50 అవుతుందని, ఆధార్ కార్డు ప్రింట్‌‌ తీసుకోవడానికి రూ.30 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

తెలంగాణ‌లో ఇప్పటికి 3.93 కోట్ల మంది ఆధార్ నమోదు చేసుకున్నారు. ​'రాష్ట్రంలో నివాసం ఉండే వారిలో 90 శాతానికిగా ఆధార్ ఎన్‌‌రోల్‌‌మెంట్ పూర్తయింది.

మిడుతలను నిర్మూలించడానికి హెలికాప్టర్లను వినియోగించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

మళ్లీ మిడుతల దండయాత్ర

మిడుతల దండయాత్ర మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంద‌ని న‌మ‌స్తే తెలంగాణ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

శనివారం హర్యానాలోని గురుగ్రామ్‌తోపాటు దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాలను పెద్ద ఎత్తున మిడుతలు చుట్టుముట్టాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు ఆరు జిల్లాల్లో పంటలను నాశనం చేశాయి. దీంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.

మిడుతల నియంత్రణ ఆపరేషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాజస్థాన్‌ నుంచి పలు బృందాలను హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌కు తరలించింది.

గత ఏడాదిన్నర కాలంగా పాకిస్థాన్‌ నుంచి పెద్ద ఎత్తున మిడుతలు సరిహద్దున ఉన్న రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడి నుంచి వివిధ రాష్ర్టాల్లోకి అడుగుపెడుతూ మార్గమధ్యంలో పెద్ద ఎత్తున పంటలను నాశనం చేస్తున్నాయి.

మిడుతలను నిర్మూలించడానికి హెలికాప్టర్లను వినియోగించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం శనివారం కేంద్రానికి లేఖ రాసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
There will be a rise on the ration goods from next month in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X