వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సింగ్: హత్రాస్ నిందితుల తరఫున వాకాల్తా.. క్షత్రియ మహాసభ కోరడంతో.. భారీగా ఫీజు

|
Google Oneindia TeluguNews

ఏపీ సింగ్.. ఈ పేరు గుర్తుండే ఉంటుంది. లాయర్.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిర్భయ దోషుల తరఫున వాదించిన అడ్వకేట్. ఇన్నాళ్లు కామ్‌గా ఉన్న ఆయన.. ఈసారి మరోసారి వార్తల్లో నిలిచారు. హత్రాస్ లైంగికదాడి ఘటన అగ్గిరాజేస్తోంది. యోగి, మోడీ సర్కార్‌ను విపక్షాలు ఏకీపారేస్తున్నాయి. అయితే ఈ సమయంలో హత్రాస్ లైంగికదాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరఫున వాదిస్తున్నారు.

అఖిల భారతీయ క్షత్రియ మహాసభ

అఖిల భారతీయ క్షత్రియ మహాసభ


హత్రాస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరఫున వాదించమని అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ఏపీ సింగ్‌ను కోరింది. మహాసభ అధ్యక్షుడు రాజ మన్వేంద్ర సింగ్ కేసు వాదించమని ఏపీ సింగ్‌ను కోరారు. మన్వేంద్ర సింగ్ మాజీ కేంద్ర మంత్రి అనే సంగతి తెలిసిందే. కేసు వాదించేందుకు సింగ్‌కు మహాసభ ఫీజు చెల్లించనుంది. ఎస్సీ, ఎస్టీలు అగ్రవర్ణాల వారిని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా రాజ్‌పుత్‌ సమాజాన్ని బాధపెడుతున్నారని తెలిపారు.

సవరాన్ సమాజ్ కూడా

సవరాన్ సమాజ్ కూడా


మహాసభే కాదు ఇటీవల సవరాన్ సమాజ్ కుల సంఘం కూడా హత్రాస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి వత్తాసు పలికింది. అంతేకాదు పంచాయతీ పెద్దలు కూడా అగ్రవర్ణాలకే సపోర్టుగా మాట్లాడారు. ఘటనపై సిట్ నిష్పక్షిపాతంగా దర్యాప్తు జరపాలని ఆందోళన కారులు కోరుతున్నారు. వారి నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అమాయకులను శిక్షించొద్దు.. కానీ దోషులను వదలొద్దు అని ప్రొటెస్ట్ చేస్తున్నారు.

మిన్నంటిన నిరసనలు

మిన్నంటిన నిరసనలు


ఆదివారం కూడా మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగారు. అయితే వారు నిందితులను సమర్థించి మాట్లాడారు. యువతి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని కోరడం విశేషం. బాధితురాలి గ్రామానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాజీ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ వీర్ సింగ్ పెహల్ాన్ ఇంటి సమీపంలో భారీగా పోలీసు బలగాలను మొహరించారు.

English summary
AP Singh, the lawyer who fought the case of all convicts in the 2012 Nirbhaya case, will be defending the accused in the Hathras gangrape case that has set off nationwide protests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X