AP Student: బర్త్ డే పార్టీ, 8వ ప్లోర్ లో నుంచి కిందపడి స్పాట్ లో చనిపోయిన నెల్లూరు స్టూడెంట్ !
చెన్నై/నెల్లూరు/ తిరుపతి: పొరుగు రాష్ట్రంలోని ప్రముఖ కాలేజ్ లో మా అబ్బాయి చదివితో మంచి ఉద్యోగం వస్తుందని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కోరుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ లో సీటు రావడంతో అబ్బాయితో పాటు అతని కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. నాలుగు సంవత్సరాల నుంచి కాలేజ్ లో అబ్బాయి చదువుకుంటున్నాడు. కాలేజ్ హాస్టల్ లో కాకుండా స్నేహితులతో కలిసి అపార్ట్ మెంట్ లో ఆ యువకుడు ఉంటున్నాడు. రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి బర్త్ డే పార్టీలో ఆ యువకుడు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అర్దరాత్రి బర్త్ డే పార్టీ జరిగిన ఫ్లాట్ నుంచి బయటకు వచ్చాడు. అపార్ట్ మెంట్ లో రౌండ్ వరండాలో తిరుక్కుని పోవడం ఎందుకు అని అనుకున్న యువకుడు పక్కరూమ్ లోకి త్వరగా వెళ్లడానికి 8వ అంతస్తులోని పైప్ పట్టుకుని పక్కరూమ్ లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆకస్మికంగా కిందపడిపోయిన యువకుడు స్పాట్ లో చనిపోవడం కలకలం రేపింది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న యువకుడు 8వ అంతస్తులో నుంచి పైపు పట్టుకుని పక్కరూమ్ లోకి వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో కిందపడి దుర్మరణం చెందిన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు కావడం, ఆ క్లిప్పింగ్స్ బయటకు రావడం కలకలం రేపింది. యువకుడు మద్యం మత్తులో 8వ అంతస్తు నుంచి కిందజారి పడిపోయి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Cheating: విడాకులు వచ్చేశాయి, పెళ్లి చేసుకుందామని యువకుడితో లేడీ ?, బంగారం, లక్షలు స్వాహా !

నెల్లూరు కుర్రాడు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన నవీన్ కుమార్ (21) చెన్నైలో ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నాడు. పొరుగు రాష్ట్రంలోని శ్రీపెదంబదూరు సమీపంలోని తాండవల్ లోని ప్రముఖ కాలేజ్ లో మా అబ్బాయి నవీన్ కుమార్ చదివితో మంచి ఉద్యోగం వస్తుందని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కోరుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ లో సీటు రావడంతో నవీన్ కుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు.

నాలుగవ సంవత్సరం విద్యార్థి
తాండవంలోని కాలేజ్ లో నవీన్ కుమార్ బీటెక్ బయో మెడికల్ నాలుగవ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజ్ హాస్టల్ లో కాకుండా స్నేహితులతో కలిసి సెంబరంబాక్కంలోని అపార్ట్ మెంట్ లోని 8వ అంతస్తులో నవీన్ కుమార్ అతని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. రాత్రి అదే అపార్ట్ మెంట్ లోని పక్క ఫ్లాట్ లో ఉంటున్న ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లిన నవీన్ కుమార్ అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి కేక్ కట్ చేసి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేశాడు.

అర్దరాత్రి రూమ్ కు వెళ్లాలని ?
బర్త్ డే పార్టీ పూర్తి అయ్యేసరికి అర్దరాత్రి దాటి పోయింది. అదే ఫ్లాట్ లో నిద్రపోవాలని నవీన్ కుమార్ కు అతని స్నేహితులు చెప్పారు. అయితే తాను మద్యం సేవించానని, తన ఫ్లాట్ కు వెళ్లి నిద్రపోతానని నవీన్ కుమార్ అతని స్నేహితులకు చెప్పాడని తెలిసింది. అర్దరాత్రి దాటిన తరువాత బర్త్ డే పార్టీ జరిగిన ఫ్లాట్ నుంచి నవీన్ కుమార్ బయటకు వచ్చాడు.

పైప్ పట్టుకుని దాటుకోవాలని ప్రయత్నించి ?
అపార్ట్ మెంట్ లో రౌండ్ గా వరండాలో తిరుక్కుని పోవడం ఎందుకు అని అనుకున్న నవీన్ కుమార్ పక్కన ఉన్న ఫ్లాట్ లోకి త్వరగా వెళ్లడానికి 8వ అంతస్తులోని పైప్ లైన్ పట్టుకుని పక్కరూమ్ లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో నవీన్ కుమార్ ఫ్రెండ్ ఒకరు అక్కడే ఉన్నాడు. పైప్ లైన్ పట్టుకోవడానికి ప్రయత్నించిన నవీన్ కుమార్ 8వ అంతస్తు పై నుంచి జారిపోయి కిందపడిపోవడంతో తీవ్రగాయాలై అతను స్పాట్ లో చనిపోయాడు.

స్పాట్ లో ప్రాణం పోయింది
ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ కుమార్ 8వ అంతస్తులో నుంచి పైపు పట్టుకుని పక్కరూమ్ లోకి వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో కిందపడి దుర్మరణం చెందిన సమయంలో అపార్ట్ మెంట్ వేల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు కావడం, ఆ క్లిప్పింగ్స్ బయటకు రావడం కలకలం రేపింది.

కాలు జారిందా ?, ఏమైనా కారణాలు ఉన్నాయా
నవీన్ కుమార్ మద్యం మత్తులో 8వ అంతస్తు నుంచి కిందజారి పడిపోయి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగా నవీన్ కుమార్ కాలుజారి పడిపోయాడా, లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? అంటూ ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ సంవత్సరం చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేస్తాడని ఎదురు చూస్తున్న నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారని అతని స్నేహితులు అంటున్నారు.