'కలాంతో ఇదే చివరి ప్రయాణమని ఊహించలేదు'

న్యూఢిల్లీ: గత ఆరేళ్లుగా అబ్దుల్ కలాం సార్‌తో కలిసి ప్రయాణాలు చేశానని, కానీ షిల్లాంగ్ ప్రయాణమే చివరి ప్రయాణం అవుతుందని అనుకోలేదని ఐఐఎమ్(అహ్మదాబాద్) పూర్వ విద్యార్థి శ్రీజన్ పాల్ సింగ్ అన్నారు. 2009 నుంచి ఆయన కలాంతో కలిసి పలు కార్యక్రమాల్లో భాగం పంచుకున్నారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో చివరిరోజు స్మృతులను, మరిన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా శ్రీజన్ సింగ్ పంచుకున్నారు. షిల్లాంగ్‌లోని ఐఐఎంకు వెళ్లిన సమయంలో కలాంతో పాటు ఆయన కూడా ఉన్నారు. స్టేజీపై ప్రసంగిస్తూ కలాం కుప్పకూలిపోయినప్పుడు వేదిక వద్ద ఉండి ప్రత్యక్షంగా చూసిన వారిలో శ్రీజన్‌పాల్ ఒకరు.

APJ Abdul Kalam's last moment at IIM Shillong documented APJ Abdul Kalam's last moment at IIM Shillong documented

గౌహతికి బయలుదేరిన విమానంలో కలాం 1ఏ, తాను 1సీ సీట్లో కూర్చున్నామని చెప్పారు. ఆయన ముదురు రంగు సూట్ ధరించారని, ఆ సూట్ చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన ఒంటిపై తాను చూసే చివరి రంగు అదే అవుతుందని ఊహించలేదన్నారు.

సుమారు 2.5 గంటల పాటు విమానంలో ప్రయాణించామని అనంతరం కారులో జర్నీ చేశామని చెప్పారు. పంజాబ్‌లో జరిగిన ఉగ్రదాడుల గురించి ఆయన వేదన చెందారని, ఈ ఘటనలలో అమాయకులు చనిపోయారని కలాం చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.

APJ Abdul Kalam's last moment at IIM Shillong documented

కాగా, భద్రత కోసం వచ్చిన ఓ పోలీసు రెండున్నర గంటలపాటు నిల్చుని ఉన్న విషయాన్ని గమనించి ఆ పోలీసుకు కలాం కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. నిల్చుని ఉండేలా చేసినందుకు క్షమించాలని ఆ పోలీసును కలాం కోరినట్లు తెలిపారు. కాగా, కలాం మాటలతో.. ఆనందం వ్యక్తం చేసిన పోలీసు.. 'మీ కోసం ఆరు గంటలైనా నిల్చునేందుకు నేను సిద్ధమే'నని చెప్పినట్లు తెలిపారు.

పార్లమెంట్, రాజకీయాలు తదితర అంశాలపై కలాం దిగులు చెందారని, ఐఐఎం విద్యార్థులకు జన ప్రయోజన రాజకీయాలు చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని కలాం వారికి ఓ ప్రశ్న సంధించాలనుకున్నారని శ్రీజన్ సింగ్ చెప్పారు. తన మార్గదర్శి ఇకలేరని శ్రీజన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+