నమ్మలేని నిజం: ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ.. మరీ ఇంత తక్కువ ధరకా?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్ల‌లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఆపిల్ ఐఫోన్ ఎస్ఈని అతి త‌క్కువ ధ‌ర‌కే అమెజాన్ ఇండియా అందిస్తోంది. అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 26,000 గ‌ల 32జీబీ వేరియంట్‌ను కేవ‌లం రూ. 17,999కే ప్రకటించింది.

బీఎస్ఎన్‌ఎల్ సంచలనం: రూ.499కే మొబైల్ ప్లస్ కనెక్షన్!

అమెజాన్ ఛాయిస్‌లో భాగంగా ఈ ఫోన్ మీద దాదాపు రూ. 8000లు త‌గ్గింపు అంద‌జేస్తోంది. అంతేకాకుండా ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌ కింద కూడా అమెజాన్ ఇండియా ఐఫోన్ ఎస్ఈని అంద‌జేస్తోంది.

Apple iPhone SE price slashed on Amazon India, now starts at Rs 17,999

రోజ్‌గోల్డ్‌, స్పేస్ గ్రే, గోల్డ్‌, సిల్వ‌ర్ రంగుల్లో ఈ ఐఫోన్ ఎస్ఈ ల‌భ్య‌మ‌వుతోంది. ఫోన్ సైజు చిన్న‌గా ఉండి, అత్యుత్త‌మ ప‌నితీరు కావాల‌నుకునే వారు ఈ ఆపిల్ ఫోన్‌ను ఎక్కువ‌గా ఆదరిస్తున్నారు.

ఇటీవ‌ల దిగుమ‌తి ప‌న్ను పెరిగిన నేపథ్యంలో ఐఫోన్ల ధ‌ర‌ల‌ను ఆపిల్ పెంచింది. అలాంటి స‌మ‌యంలో కూడా ఇంత త‌క్కువ ధ‌ర‌కు అమెజాన్ విక్ర‌యాలు చేప‌డుతుండ‌టం నిజంగా విశేష‌మేన‌ని సాంకేతిక నిపుణులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Apple iPhone SE (32GB) is available for as low as Rs 17,999 on Amazon India, down from Rs 26,000. The e-commerce website is also offering up to Rs 15,000 off en exchange. It is important to note that price-cut is not official and the phone is listed for Rs 26,000 on Apple India website. Also, Flipkart and not Amazon is the official reseller for Apple in India. The 128GB variant of Apple SE is priced at Rs 35,000. The phone can be bought in Rose Gold, Space Grey, Gold and Silver colour options.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి