వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలిగ్ బూత్ నుంచి పరుగెత్తించి కొట్టారు -టీఎంసీ అభ్యర్థి సుజాతా ఖాన్‌పై దాడి -బీజేపీపై బెంగాల్ సీఎం మమత ఫైర్

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ లోనూ అక్కడక్కడా హింస చెలరేగింది. టీఎంసీ, బీజేపీ శ్రేణులు ఘర్షణలకు దిగారు. హుగ్లీ జిల్లా ఆరాంబాగ్ అసెంబ్లీ సెగ్మెంట్లోనైతే ఏకంగా టీఎంసీ అభ్యర్థి సుజాతా మండల్ ఖాన్ పైనే దాడి జరిగింది. ఈ ఘటనతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా దాడులు చోటుచేసుకున్నాయని, బీజేపీ గుండాయిజానికి ఈసీ అడ్డుకట్ట వేయలేకపోతున్నదని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.

సీఎం జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ -సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ రాకతో వణుకు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనంసీఎం జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ -సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ రాకతో వణుకు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం

పోలింగ్ సందర్భంగా మంగళవారం ఆరాంబాగ్ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ స్టేషన్ పరిశీలనకు వెళ్లగా, కార్యకర్తల రూపంలోని బీజేపీ గుండాలు దాడికి పాల్పడ్డారని, కర్రలు, రాళ్లు ఇటుకలతో ఇష్టారీతిగా కొట్టారని టీఎంసీ అభ్యర్థి సుజాతా మండల్ తెలిపారు. ఈ ఘటనలో ఎన్నికల సిబ్బందికి కూడా గాయాలయ్యాయని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. దళిత సామాజికవర్గానికి చెందిన సుజాతా మండల్.. బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య అయినప్పటికీ, భర్తతో విభేదించి టీఎంసీలో చేరారు.

Arambagh TMC candidate sujatha khan attacked, Chased Out Of Poll Booth, Mamata slams bjp

పోలింగ్ స్టేషన్ వద్దే తమ అభ్యర్థి సుజాతా ఖాన్ పై దాడి జరగడాన్ని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఖండించారు. బేటీ బచావో అని నినాదాలు చేసే బీజేపీ వాస్తవంలో మహిళలపై భయానక దాడులు చేస్తున్నదని, బీజేపీ గుండాయిజాన్ని అడ్డుకోవడంలో ఎన్నికల సంఘం మెతక వైఖరి అవలంభిస్తున్నదని బెంగాల్ సీఎం విమర్శించారు.

Arambagh TMC candidate sujatha khan attacked, Chased Out Of Poll Booth, Mamata slams bjp

viral video: తలపతి స్ట్రాంగ్ మెసేజ్ -సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్‌ -ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీచార్జ్viral video: తలపతి స్ట్రాంగ్ మెసేజ్ -సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్‌ -ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీచార్జ్

''కేంద్ర బలగాల బహిరంగ దుర్వినియోగం అప్రతిహతంగా కొనసాగుతోంది. మేము పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నప్పటికీ, చాలా ప్రాంతాల్లో యూనిఫాంలోని వ్యక్తులు ఒక పార్టీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా చాలా మందిని ప్రభావితం చేస్తుండగా, టీఎంసీ ఓటర్లను బహిరంగంగా బెదిరిస్తుండగా, ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిగా కొనసాగుతోంది'' అని మమత బెనర్జీ ఆరోపించారు.

English summary
Clashes broke out between TMC and BJP workers in Arambagh of West Bengal on Tuesday as the area voted in the third phase of assembly elections. TMC candidate Sujata Mondal was allegedly attacked by mask-clad men who threw bricks at her. TMC has filed a complaint with the Election Commission over the attack on Sujata Mondal. TMC supremo Mamata Banerjee said, "We shall take legal action against such central force personnel. We shall file an FIR. They talk about Beti Bachao and beat up my woman candidate Sujata Mondal, who is also an SC candidate."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X