కొత్త ట్విస్ట్: షీనా బోరా ఫోరెన్సిక్ శాంపిళ్లు మిస్..?
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా మర్డర్ కేసు దర్యాప్తులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి, ఎంతో ముఖ్యమైన షీనా బోరా ఫోరెన్సిక్ శాంపిల్స్ మిస్ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
షీనా బోరాను ఆమె కన్న తల్లి ఇంద్రాణి ముఖార్జియా 2012, ఏప్రిల్ 24వ తేదీన షీనా బోరా హత్య చేసిన సంగతి తెలిసిందే. షీనా బోరాను హత్య చేసిన అనంతరం, ఆమెను తగలబెట్టిన ప్రాంతాన్ని ముంబై పోలీసులు తవ్వి ఆమెకు చెందిన కొన్ని ఎముకలు, పుర్రెతో పాటు ఒక సూట్ కేసును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
స్వాధీనం చేసుకున్న ఎముకలు, పుర్రెలను ముంబై పోలీసులు జేజే ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ శాంపిళ్లు కనిపించకుండా పోయాయనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.

ఈ విషయంపై అటు ముంబై పోలీసులు, జేజే ఆసుపత్రి లేదంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ఎవరూ కూడా నోరు మెదపడం లేదు. మిడ్ డే పత్రిక కథనం ప్రకారం షీనా బోరా ఎముకలను భద్రపరిచినట్లు పెన్ పోలీస్ స్టేషన్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడవి అక్కడ కనిపించడం లేదంట. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మరోసారి సమర్పించాల్సిన శాంపిళ్లపై గందరగోళం నెలకొంది.
ఇది ఇలా ఉంటే షీనా బోరా అస్థిపంజరంలోని కొన్ని ఎముకలను తీసుకుని డీఎన్ఎ పరీక్ష చేయగా అవి షీనా తల్లి ఇంద్రాణి ముఖార్జియా, సోదరుడు మైఖెల్ డీఎన్ఎతో సరిపోలినట్లు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications