టెక్కీలకు షాక్: ఇక గడ్డురోజులే, సీనియర్లపై వేటు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: టెక్కీలకు రానున్నవి గడ్డు రోజులే. రానున్న ఆరు మాసాల్లో ఉద్యోగావకాశాలు మరింత తగ్గిపోనున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఆటోమేషన్, డిజిటలైజేషన్ ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాల్లో భారీగా కోత పడనుందని రిపోర్టులు తెలుపుతున్నాయి.

అమెరికాలో చోటుచేసుకొన్న పరిణామాలు ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ రంగంపై తీవ్రంగా కన్పిస్తోంది. ఈ పరిణామాలపై టెక్కీల ఉద్యోగాలపై చూపుతున్నాయి. అమెరికాలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ట్రంప్ తీసుకొన్న నిర్ణయాల ప్రభావం ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ రంగంపై చూపుతోంది.

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న పరిణామాలు కూడ సాఫ్ట్‌వేర్ రంగంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగం మందగమనంలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిణామాలన్నీ టెక్కీలపై చూపుతున్నాయి.రానున్న రోజుల్లో టెక్కీలకు గడ్డుకాలమేనని సర్వే నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే సీనియర్ల ఉద్యోగాలకే ఎసరు వచ్చే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

 1.రానున్నది టెక్కీలకు గడ్డుకాలమే

1.రానున్నది టెక్కీలకు గడ్డుకాలమే

దేశీయ ఐటీ ప్రొఫెషినషల్స్‌కు గడ్డు కాలం మరింత పెరుగుతోంది. వచ్చే ఆరు నెలలు కూడా ఐటీ ప్రొఫిషనల్స్‌కు ఉద్యోగవకాశాలు తగ్గిపోనున్నాయని తాజా రిపోర్టులు వెల్లడించాయి. ఆటోమేషన్‌, డిజిటైజేషన్‌ ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాలకు భారీ మొత్తంలో ఆటంకం కలుగనున్నట్టు తెలిపాయి.ఐటీ రంగంలో సీనియర్ టెక్కీల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఎక్స్‌పెరిస్ ఐటీ- మ్యాన్ పవర్ గ్రూప్ సర్వే

ఎక్స్‌పెరిస్ ఐటీ- మ్యాన్ పవర్ గ్రూప్ సర్వే

ఎక్స్‌పెరిస్‌ ఐటి - మ్యాన్‌ పవర్ గ్రూప్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ఎక్స్‌పెరిస్‌ ఐటీ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే ప్రకారం 2017 అక్టోబర్‌ నుంచి 2018 మార్చి మధ్యలో కూడా ఐటీ నియామకాలు తగ్గిపోనున్నాయని తెలిసింది. అంతేకాక సీనియర్‌ స్థాయిలో లేఆఫ్స్‌ అధికంగా ఉండనున్నాయని సర్వే వెల్లడించింది.

 కాగ్నిజెంట్‌లో 400 సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై వేటు

కాగ్నిజెంట్‌లో 400 సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై వేటు

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ 400 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల వాలంటరీ సెపరేషన్‌ ప్యాకేజీని అంగీకరించిందని తెలిపింది. గత కొన్ని నెలల క్రితమే డైరెక్టర్లకు, అసోసియేట్‌ వీపీలకు, సీనియర్‌ వీపీలకు ఈ ప్రొగ్రామ్‌ను ఆఫర్‌ చేసింది. క్యాప్‌జెమిని కూడా 35 మంది వీపీ, ఎస్‌వీపీలు, డైరెక్టర్లు, సీనియర్‌ డైరెక్టర్లను కంపెనీని వీడాలని ఆదేశించింది.

ఇన్పోసిస్‌లో వెయ్యి మందిపై వేటు

ఇన్పోసిస్‌లో వెయ్యి మందిపై వేటు

ఇన్ఫోసిస్‌ కూడా జాబ్‌ లెవల్‌ 6, ఆపై స్థాయి ఉద్యోగులు వెయ్యి మందిని కంపెనీని వీడాలని ఆదేశాలు జారీచేసినట్టు ఈ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.

10 నుంచి 20 ఏళ్ల అనుభవమున్న మధ్య, సీనియర్‌ లెవల్‌ స్థాయి ప్రొఫెషనల్స్‌పై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని నివేదిక వెల్లడిస్తోంది.ప్రముఖ ఐటీ కంపెనీలు సీనియర్లను ఇంటికి సాగనంపడానికి లేఆఫ్స్‌ ప్రక్రియను చేపడుతున్నాయిని సర్వే తెలిపింది.. కేవలం 3 శాతం కంపెనీలు మాత్రమే సీనియర్‌ స్థాయి ఉద్యోగులను నియమించుకోవడానికి మొగ్గుచూపుతున్నాయని వివరించింది. 0-5 ఏళ్ల అనుభవమున్న అభ్యర్థులకు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడిందని చెప్పింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Recently, about 400 senior executives of Cognizant accepted the company's voluntary separation package. Cognizant had announced this programme for directors, associate VPs and senior VPs a few months ago.French IT services major Capgemini had reportedly asked over 35 VP, SVPs, directors and senior directors to leave in February.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి