ఎల్ఓసీ సమీపంలో కుప్పకూలిన ఆర్మీ హెలికాపర్టర్: పైలట్ మృతి, కో-పైలట్‌కు తీవ్రగాయాలు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లోని బరౌమ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి భారత ఆర్మీ చిరుత హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయింది. హెలికాప్టర్ సిబ్బందిని రక్షించేందుకు భద్రతా బలగాల సెర్చ్ పార్టీలు మంచు చుట్టుముట్టిన ప్రాంతానికి చేరుకున్నాయని రక్షణ అధికారులు తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
సురక్షితంగా బయటపడ్డారని భావిస్తున్న పైలట్, కో-పైలట్ కోసం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించబడింది. అయితే, కో-పైలట్‌ను రక్షించే క్రమంలో పైలట్ మృతి చెందినట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి.

హెలికాప్టర్ ప్రమాదాన్ని SDM గురెజ్ ధృవీకరించారు. ఘటన జరిగిన ప్రాంతం బందిపూర్ జిల్లాలో ఉంది. వార్తా సంస్థ PTI ప్రకారం.. ఈ ప్రదేశం పాకిస్తాన్ నియంత్రణ రేఖకు సమీపంలో ఉంది. కాగా, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications