కాల్పులు: ముగ్గురు చొరబాటుదారుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. సైన్యానికి, వేర్పాటువాద గెరిల్లాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదారులు హతమయ్యారు. కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు చొరబాటుదార్లను సైన్యం హతమార్చిందని భద్రతావర్గాలు తెలిపాయి.
ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా కనిపించిన చొరబాటుదారులను నిఘావర్గాలు అడ్డగించి ప్రశ్నించాయి. దీంతో వారు కాల్పులకు దిగారు. ఈ నేపథ్యంలో సైన్యానికి, గెరిల్లాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

కొన్ని గంటల పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదారులను మట్టుపెట్టిన భద్రతా దళాలు, భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
మూడు ఏకె 47 రైఫిల్స్, 12 ఏకే మాగ్జైన్స్ను, సుమారు 300రౌండ్ల బుల్లెట్లు, రెండు అండర్ బ్యారెల్ గ్రెనైడ్ లాంచర్లను స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం రక్షణాధికారి ఒకరు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications