జయలలిత మృతి మిస్టరీ: 15 మందికి నోటీసులు, పోయెస్ గార్డెన్ లో విచారణ, ఏం జరిగింది !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక ఉన్న మిస్టరీ నిగ్గుతేల్చేందుకు చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం నుంచి శ్రీకారం చుట్టారు.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక ఉన్న మిస్టరీ నిగ్గుతేల్చేందుకు చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం నుంచి శ్రీకారం చుట్టారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగస్వామి సోమవారం పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న 15 మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు.

పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంటిలో పని చేస్తున్న వారు, భద్రతా సిబ్బందిని విచారించాలని రిటైర్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నిర్ణయించారు. పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న వారికి ఇప్పటికే సమన్లు జారీ చేశారు. వారందరూ సోమవారం రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ముందు హాజరుకానున్నారు.

Arumugasamy inquiry Commission begin from today in Chennai

అన్నాడీఎంకే పార్టీ వర్గాలు, తమిళనాడు ప్రజలు అమ్మ మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు చెయ్యడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి విచారణ కమిషన్ కు ఆదేశించారు. విచారణ కమిషన్ కు ప్రత్యేక కార్యాలయం, సంబంధిత ఏర్పాట్లు చెయ్యడంలో జాప్యం జరిగింది.

ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సోమవారం రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి రంగంలోకి దిగారు. పోయెస్ గార్డెన్ లో జయలలిత ఇంటిలో పని చేస్తున్న వారిని మొదట విచారణ చేసి వివరాలు సేకరించాలని రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నిర్ణయించారు. వేదనిలయంలో పని చేస్తున్న వారిని రిటైడర్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+