మోడీజీ విదేశీ పర్యటన పూర్తిచేయండి.. మధ్యలో రావొద్దని జైట్లీ భార్య, కుమారుడు వినతి

న్యూఢిల్లీ : కట్టుకున్న భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో పుట్టెడు దు:ఖంలో ఉంది ఆ భార్య. కన్న తండ్రి లేడనే విషయాన్ని జీర్ణించుకోలేని అతను గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఇంతలో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఫోన్ వచ్చింది. అయితే వారు మాత్రం తమ ఆత్మీయుడు లేడని పర్యటనకు ముగించుకొని రావొద్దని కోరి భారత ప్రజల గుండెల్లో నిలిచారు. మాజీ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరణవార్త తెలిసి జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోషన్‌తో మాట్లాడిన సమయంలో వారు మోడీకి చెప్పిన అంశం ప్రతి ఒక్క భారతీయుడి మనస్సును కదిలిస్తోంది.

శనివారం మధ్యాహ్నం అరుణ్ జైట్లీ చనిపోయారు. ఈ విషయం తెలిసి బీజేపీ శ్రేణులు నిర్ఘాంతపోయాయి. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ కూడా విషాద వదనంలో ఉన్నారు. వెంటనే జైట్లీ కుటుంబంతో మాట్లాడారు. జైట్లీ లేరని తెలిసి వారిని ఓదార్చారు. ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అయితే ఇంతలో జైట్లీ భార్య రూప కలుగజేసుకొన్నారు. మీరు జీ 7 సదస్సుకు వెళ్లారని .. పర్యనట ముగించుకొని రావాలని చెప్పారు. మీ పర్యటనను జైట్లీ లేరనే అంశంతో ఆపేయద్దని కోరారు. తర్వాత మోడీతో మాట్లాడిన రోషన్ కూడా అదే విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.

Arun Jaitley’s family asks PM, who is on 3-nation visit, to not cancel tour

జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు. ఫ్రాన్స్, యూఏఈ, బహ్రెయిన్ దేశాల్లో పర్యటించారు. జీ 7 సమావేశంలో సోమవారం పాల్గొని తిరిగి ఇండియా వచ్చేస్తారు. ఇంతలో జైట్లీ లేరని వార్తను మోడీ జీర్ణించుకోలేకపోయారు. దీంతో సోషల్ మీడియా ట్విట్టర్‌లో మోడీ విచారం వ్యక్తం చేశారు. తాను ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయానన్నారు మోడీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+