హెలికాప్టర్ ఎక్కుతుండగా తూలిపడిపోయిన జైట్లీ: స్వల్ప గాయాలు
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం హెలికాప్టర్‌ను ఎక్కుతుండగా తూలి పడిపోయారు దీంతో ఆయన స్వల్ప గాయాలయ్యాయి, కాగా, జైట్లీ బాగానే ఉన్నారనీ, అదే హెలికాప్టర్‌లో బైలుదేరి ఢిల్లీ వెళ్లిపోయారని
హరిద్వార్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం హెలికాప్టర్‌ను ఎక్కుతుండగా తూలి పడిపోయారు దీంతో ఆయన స్వల్ప గాయాలయ్యాయి, కాగా, జైట్లీ బాగానే ఉన్నారనీ, అదే హెలికాప్టర్‌లో బైలుదేరి ఢిల్లీ వెళ్లిపోయారని హరిద్వార్ ఎస్‌ఎస్‌పీ కృష్ణకుమార్ తెలిపారు.
పడర్థా ప్రాంతంలో ఉన్న యోగాగురు బాబా రామ్‌దేవ్ 'పతంజలి హెర్బల్ ఫుడ్‌పార్క్' సందర్శనకు వచ్చిన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సందర్శన ముగించుకుని తిరిగివచ్చి హెలికాప్టర్ ఎక్కుతుండగా ఆయన ఒక్కసారిగా తూలి పడిపోయారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.

వెంటనే, ఓ వైద్యుడు జైట్లీని పరీక్షించారు. ఆ సమయంలో పక్కనే రామ్‌దేవ్ బాబా తదితరులు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి జైట్లీ గురించి పెద్దగా ఆదుర్దా చెందాల్సిన అవసరం లేద, ఆయన బాగాఉన్నారనీ ఓ అధికారి వివరించారు.












Click it and Unblock the Notifications