జ్యోతిష్యులు మేలు: మార్కెట్ విశ్లేషకులకు జైట్లీ చురక
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థికవేత్తలు, మార్కెట్ కామెంటేటర్స్‌కు చురకలు అంటించారు. గ్రీస్ రెఫరండమ్ అనంతరం భారత్ మార్కెట్లలో ఏం జరుగుతుందో అన్నదానిపై పరిస్థితులకనుగుణంగా మార్కెట్ విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు తమ అభిప్రాయాలను మార్చుకోవడంపై జైట్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కొన్ని నెలలుగా ముడి చమురు ధరలపై ఆర్థికవేత్తల అంచనాలపై వ్యాఖ్యానిస్తూ జ్యోతిష్య శాస్త్రానికే విశ్వసనీయత పెరిగేలా ఉందన్నారు. ఆదివారం రాత్రి నేను టీవీ చూస్తున్నానని, గ్రీస్ రెఫరండమ్ ఫలితాలు అప్పుడప్పుడే విడుదలవుతున్నాయని, ఒక టీవీ వ్యాఖ్యాత, బాగా అనుభవమున్న, సాధికారికంగా విశ్లేషించే సదరు వ్యక్తి సోమవారం మార్కెట్లలో నష్టాలు ఏరులై పారుతాయ అని పేర్కొన్నారని చెప్పారు.

మధ్యాహ్నం వరకూ ఆ అంచనాలు కొంత నిజం అయ్యాయని, ఆ తర్వాత మన మార్కెట్లు సానుకూలంగా మారడంతో, విశ్లేషకులు కూడా తమ అంచనాలను వెనువెంటనే మార్చుకోవడం కనిపించిందని, ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని సరిగా అంచనా వేయలేకపోతున్నారనే ఉద్దేశ్యంతో జైట్లీ మాట్లాడారు.












Click it and Unblock the Notifications