వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్: 5లక్షల లోపు పన్ను రిబేట్, కొత్త ఉద్యోగులకు వరం, ప్రపంచంలో భారత్ భేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంటులో 2016 - 17 బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

మొత్తం బడ్జెట్ - 19.78 లక్షల కోట్లు
ప్రణాళికా వ్యయం రూ.5.5 లక్షల కోట్లు
ప్రణాళికేతర వ్యవయం 14.28 లక్షల కోట్లు
ద్రవ్యలోటు 3.5 శాతం
రెవెన్యూ లోటు 2.5 శాతం

- బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.

- ఎక్సైజ్ శాఖ పన్ను నుంచి బీడీలకు మినహాయింపు
- పొగాకు ఉత్పత్తులపై 10 శాతం నుంచి పదిహేను శాతానికి పెంపు
- రూ.1 కోటి దాటిన ఆదాయంపై 15 శాతం సర్‌ఛార్జీ
- విలాసవంతమైన కార్ల పైన పన్ను ఒక్క శాతం. పెట్రోల్ కార్లపై రూ.1 శాతం సెస్, డీజిల్ కార్లపై రూ.2.5 శాతం సెస్
- 60చ.మీ. విస్తీర్ణం గల ఇల్లు, ప్లాట్లకు సేవా పన్ను మినహాయింపు
- ఆధార్ ఆధారంగా సంక్షేమ పథకాల రాయితీల చెల్లింపు.
- నిరామయి ఆరోగ్య బీమా పథకానికి సేవా పన్ను రాయితీ
- స్టార్టప్ ద్వారా పొందే లాభాలపై మూడేళ్లపాటు నూరు శాతం రాయితీ.
- గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు రూ.50వేలు పెంపు.
- ఆరుకోట్ల గ్రామీణ ఆవాసాలకు డిజిటల్ విద్య.
- వచ్చే మూడేళ్లలో పోస్టాఫీస్లుల్లో ఏటీఎంలు, మైక్రో ఏటీఎంలు పెంపు
- 9 సూత్రాల ఆధారంగా పన్ను ప్రతిపాదనలు

Arun Jaitley to present his third Budget

- సింగిల్ బీమా పథకాలపై పన్ను తగ్గింపు

దేశవ్యాప్తంగా 3వేల జనరికి దుకాణాలు.

- 9 సూత్రాల ఆధారంగా పన్ను ప్రతిపాదనలు
- తద్వారా దాదాపు 2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం.
- రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి పన్ను రిబేట్ రూ.2వేల నుంచి రూ.5వేలకు పెంపు.
- ఇంటి అద్దె పైన పన్ను మినహాయింపు రూ.24వేల నుంచి రూ.60వేలకు పెంపు. సొంత ఇల్లు లేని, హెచ్ఆర్ఏ పొందని ఉద్యోగులకు వర్తింపు. సెక్షన్ 87ఏ కింద ట్యాక్స్ రిబేట్ రూ.2వేల నుంచి రూ.5వేలకు పెంపు.
- దీనదయాళ్ ఉపాద్యాయ, గురు గోవింద్ సింగ్‌ల జయంతికి 100 కోట్లు,

- 9 సూత్రాలతో ముందుకు... 1 వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం, 2 గ్రామీణ అభివృద్ధి, 3 సామాజిక రంగం, ఆరోగ్య రంగం, 4 విద్యా నైపుణ్యాలు, ఉపాది కల్పన, 5 మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, 6 ఆర్థిక సంస్కరణలు, 7 వ్యాపార అనుకూలాంశ విధానాలు, 8 ఆర్థిక క్రమశిక్షణ, 9 భారం తగ్గించేలా పన్ను సంస్కరణలు

Arun Jaitley to present his third Budget

- ఆర్థిక సేవల విషయంలో ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ చట్ట సవరణ
- సాగర మాల ప్రాజెక్టు కోసం రూ.8వేల కోట్లు.
- బ్యాంకుల మూలధన సమీకరణకు రూ.25వేల కోట్లు
- ఒక్క రోజులోనే స్టార్టప్ కంపెనీల రిజిస్ట్రేషన్ కు అనుమతి.
- రూ.900 కోట్లతో పప్పు ధాన్యాల మార్కెట్ స్థిరీకరణ నిధి.
- స్టాక్ ఎక్సేజ్, బీమా, పింఛన్ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అనుగుణంగా సంస్కరణలు
- రుణ విధానం పారదర్శకంగా ఉండేలా రిజర్వ బ్యాంక్ చట్ట సవరణలు
- ముద్ర బ్యాంక్ ద్వారా రూ.1.80వేల కోట్ల రుణాలు
- డైరీ ఫార్మర్స్‌కు నాలుగు కొత్త ప్రాజెక్టులు.
- గ్రామీణ మహిళలకు గ్యాస్ కనెక్షన్లు
- 3.5 కోట్ల చౌక దుకాణాల డిజిటలైజేషన్.
- ప్రభుత్వ రంగ సంస్థల స్థిరీకరణకు చర్యలు
- గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు రాయితీలు
- విద్యుదుత్పత్తి పెంపుకు రూ.3వేల కోట్లు పెంపు
- సెబి ద్వారా కొత్తగా కమోడిటీ డేరివేటివ్ మార్కెట్.
- పెట్టుబడుల ఉపసంహరణ శాఖను పెట్టుబడులు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖగా మార్పు.
- భారత్‌లో తయారైన ఆహార ఉత్పతతుల్లో నూరు శాతం ఎఫ్‌డీఐకి అనుమతి
- జాతీయ సర్వీస్ కెరియర్ ప్లాట్ ఫాంతో రాష్ట్ర ఉఫాధి కల్పన కార్యాలయాల అనుసంధానం.

Arun Jaitley to present his third Budget

- మౌలిక సదుపాయాల రంగానికి కొత్త రేటింగ్ విధానం
- గ్రామీణాభివృద్ధికి 228 శాతం నిధులు పెంపు.
- మౌలిక సదుపాయల రంగంలో పన్ను రహిత బాండ్ల జారీ
- తూర్పు, పశ్తిమ తీర ప్రాతాల్లో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఓడ రేవులు
- అణు విద్యుదుత్పత్తికి రూ.3 వేల కోట్లు
- రూ.150 కోట్లతో అసంపూర్ణంగా ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణ
- ప్యాసింజర్ రవాణా రంగంలో ప్రయివేటుకు పచ్చజెండా.
- రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వేలకు 2.21.246 కోట్లు
- చమురు నిక్షేపాల వెలికితీతకు అత్యంత ప్రాధాన్యం.
- రవాణా రంగంలో లైసెన్స్ రాజ్ కు స్వస్తి.
- ప్యాసింజర్ బస్సుల నిర్వహణకు కొత్త ప్రయోగం.
- బహుముఖ నైపుణ్యాల శిక్షణకు దేశవ్యాప్తంగా 5700 ఫాఠశాలలు
- జాతీయ రహదారులకు రూ.97వేల కోట్లు.
- కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు8.33శాతం ఈపీఎప్ ప్రభుత్వం చెల్లిస్తుంది.
- రాబోయే మూడేళ్లలో కోటి మంది యువతకు నైపుణ్యాల పెంపు.
- రైల్వేల అభివృద్ధికి రూ.2.18 లక్షల కోట్లు.

Arun Jaitley to present his third Budget

- చిన్న దుకాణాలు వారంలో అన్ని రోజులూ వ్యాపారం చేసుకునేందుకు అనుమతి.
- అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ జీవనస్థితిగతులు పెంపుకు కృషి
- నకిలీ సర్టిఫికేట్ల నిరోధం కోసం డిజిటలైజేషన్.
- కుటుంబానికి లక్ష మేర ఆరోగ్య భీమా
- దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5542 గ్రామాల్లో విద్యుదీకరణ
- విద్య, ఉద్యోగ భద్రత, జీవన ప్రమాణాలు, నైపుణ్యం పెంపు
- రైతు రుణాల వడ్డీ రాయితీకి రూ.15వేల కోట్లు.
- గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్ల కోసం రూ.2వేల కోట్లు.
- కొత్తగా 62 నవోదయ విద్యాలయాలు. ప్రధానమంత్రి కౌశల్ యోజన ద్వారా యువతకు ఉపాధి కోసం రూ.1700 కోట్లు.
- పంచాయతీ, పురపాలక సంఘ ఆర్థిక సాయం కోసం రూ.2.87 లక్షలు గ్రాంటు
- పశు సంవర్ధక శాఖకు రూ.850 కోట్లు
- 300 రూర్బన్ క్లస్టర్ల ఏర్పాటు
- ఉన్నత విద్యకు నిధులు ఇచ్చేందుకు రూ.1000 కోట్లతో కార్పస్ ఫండ్
- బహిరంగ మలమూత్ర విసర్జనను పారద్రోలాలి, అందుకోసం గ్రామాలకు పురస్కారాలు
- దళితుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక విభాగం.
- పంటల బీమా పథకం కోసం రూ.5500 కోట్లు.
- గత ఏడాది కంటే ఉపాధి హామీకు రూ.4వేల కోట్లు అదనం.
- వృద్ధులకు అదనంగా రూ.30వేలు బీమా
- స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాకు రూ.500 కోట్లు.
- వ్యవసాయ రంగానికి రూ.35985 కోట్లు.
- సేంద్రియ వ్యవసాయానికి రూ.412 కోట్లు.
- భూగర్భ జలాల పెంపుకు రూ.60వేల కోట్లు.
- ఉపాధి హామీ పథకానికి 38,500 కోట్లు.
- 2018 మే నాటికి వంద శాతం గ్రామాల్లో విద్యుదీకరణ
- 14వ ఆర్థిక రంగం సూచన మేరకు గ్రామీణ రంగానికి నిధులు.
- ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ.19వేల కోట్లు.
- 6వేల గ్రామాల్లో డిజిటల్ విద్య ఏర్పాటు.
- ఆహార భద్రతకు రూ.35,984 కోట్లు.
- భూసార పరీక్షలకు రూ.268 కోట్లు.
- గ్రామీణ విద్యుదీకరణకు 8500 కోట్లు
- గ్రామీణ రంగానికి 2.87 లక్షల కోట్లు
- మూడేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం. దేశంలో సగం కంటే ఎక్కువ వ్యవసాయానికి నీటి కొరత.
- రోడ్డు కనెక్టివిటికీ రూ.27వేల కోట్లు. వీటితో 2.23 లక్షల రోడ్ కనెక్టివిటీ. స్వచ్ఛ భారత్ కోసం రూ.9వేల కోట్లు
- 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో రాష్ట్రాలకు వాటా పెంపు.

Arun Jaitley to present his third Budget

- స్వల్ప ప్రీమియం ఎక్కువ పరిహారంతో పంటలకు పిఎల్ బీమా పథకం రైతుల కోసం ఏప్రిల్ 14 నుంచి ఈ మార్కెటింగ్ పథకం.
- రైతుల కోసం పంటల బీమా పథకం
- వచ్చే ఏడాది నుంచి జనరల్ ఇన్సురెన్సులు పబ్లిక్ ఇష్యూలోకి.
- ఎగుమతులకు ప్రోత్సాహం, ఆర్థిక వనరులపై దృష్టి.
- నాబార్డ్ కింద నీటి పారుదల కోసం రూ.20వేల కోట్లు. మార్చి 31 నాటికి 23 ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం.
- గ్రామీణ, ఇతర కీలక రంగాలకు అదనపు వనరులు సమకూర్చాం.
- సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం.
- వచ్చే అయిదేళ్లలో రైతుల ఆధాయం రెట్టింపు చేయాలన్నది తమ లక్ష్యం. నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువుల తయారీ.
- గ్రామీణ, వ్యవసాయ, బ్యాంకింగ్ రంగాలకు ఆర్థిక దన్ను.
- పప్పు ధాన్యాల అభివృద్ధికి రూ.500 కోట్లు.
- వ్యసాయ రంగానికి రూ.35,985 కోట్లు. వచ్చే ఐదేళ్లలో సాగునీటికి రూ.86500 కోట్లు.
- ప్రభుత్వ బ్యాంకుల బలోపేతం, మౌలిక సదుపాయాల అవకాశాలు పెంచుతాం.
- ప్రభుత్వం కొత్తగా తెస్తున్న ప్రధాని పంటల బీమా యోజన రైతులకు భరోసా ఇవ్వనుంది.
- ద్రవ్యోల్భణం 9.6 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించాం.
- ప్రధాని సించాయి యోజన కింద 25 లక్షల ఎకరాలకు సాగునీరు
- జిఎస్టీ ఆమోదం, కాలం చెల్లిన చట్టాలపై దృష్టి సారించాం.
- ఈ ఏడాది ప్రణాళికా వ్యయాన్ని పెంచుతున్నాం.

Arun Jaitley to present his third Budget

- వ్యవసాయం - ఉపాధి హామీ అనుసంధానం.
- వచ్చే ఏడాది 9 సూత్రాల ఆధారంగా అభివృద్ధి.
- ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు.
- ద్రవ్యలోటును 1.4 శాతానికి తగ్గించకలిగాం. 2022 కల్లా వ్యవసాయ ఆధారిత వ్యవసాయం రెట్టింపు మా లక్ష్యం.

- వ్యవసాయ, నిర్మాణ, బ్యాంకింగ్ రంగాలపై దృష్టి పెట్టాం.
- బిపిఎల్ కుటుంబాలకు వంట గ్యాస్.
- వంట గ్యాస్ అందరికీ అందుబాటులోకి చర్యలు తీసుకున్నాం. దీంతో మహిళల ఆరోగ్యం మెరుగుపడింది.
- రిటైల్ ద్రవ్యోల్భణం 5.4 శాతానికి తగ్గింది.
- విదేశీ మారక నిల్వలు ఎన్నడూ లేంత లేనంత స్థాయికి పెరిగాయి. 350 బిలియన్ డాలర్ల మారక ద్రవ్యం ఉంది.
- ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం.
- గత ఏడాది అంతర్జాతీయ వృద్ధి రేటు 3.1 శాతానికి దిగజారింది. మన జిడిపి 6.3 శాతం నుంచి 7.6 శాతానికి చేరుకుంది.

Arun Jaitley to present his third Budget

- కరెంట్ అకౌంట్ లోటు తగ్గించగలిగాం. సవాళ్లను అవకాశాలుగా మలుచుకున్నాం.
- రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావం 13శాతం పెరిగింది. 21 నెలలుగా మేం తీసుకున్న చర్యలతో వృద్ధి రేటు పెరిగింది.
- అంతర్జాతీయంగా ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ బాగుందని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రశంసించాయి.
- జైట్లీ ప్రసంగం ప్రారంభించారు.
- 2016-17 బడ్జెట్‌ను జైట్లీ లోకసభలో పదకొండు గంటలకు ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రారంభంలో విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

- ప్రధాని మోడీ తెల్లని దుస్తుల్లో పార్లమెంటుకు వచ్చారు.
- 2016-17 సాధారణ బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదించారు.

English summary
There are enough indications to suggest that the Union Budget for 2016-17 will primarily focus on stimulating growth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X