అరుణాచలం వెళ్తున్నారా, కీలక సమాచారం..!!

తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కు బిగ్ అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం ఆలయానికి వెళ్తూ ఉంటారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రైల్వే.. ఆర్టీసీ పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కాగా, వంట గ్యాస్ సిలిండర్ల కొరత దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల పైన పడింది. దీంతో, అరుణాచలం ఆలయంలోనూ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యామ్నాయాల పైన కసరత్తు చేస్తున్నారు.

గ్యాస్‌ కొరత కారణంగా తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీని నిలిపివేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు గత మూడేళ్ల నుంచి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేస్తున్నారు. ఈ లడ్డూలు, గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, కట్టెల పొయ్యిలపై ప్రసాదం తయారు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ప్రభుత్వ అనుమతి వస్తే కట్టెలపొయ్యి పై ప్రసాదం తయారీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. లడ్డూలు, మురుకు లు, అతిరసాల తయారీకి అవసరమైన గ్యాస్ లభ్యత తగ్గడం తో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు వివరిస్తున్నారు. ఇరాన్ పరిణామాల వల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా లడ్డూ ప్రసాదం నిలిపివేతతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి మళ్ళీ ప్రసాద విక్రయాలను ప్రారంభిస్తామని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

arunachalam-temple-stops-free-laddu-for-devotees-due-to-lpg-shortage-seek-govt-permission-for-alte

ప్రభుత్వం చొరవ చూపించాలని భక్తుల వినతి

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత అనేక రంగాలను ప్రభావితం చేస్తుండగా, దాని ప్రభావం ఆలయా లపై కూడా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ పంచభూత ఆలయాలలో అగ్ని స్థలంగా భావించే తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయంలో అన్నామలైయార్ దర్శనం కోసం, భక్తులు ఆలయం వెనుక ఉన్న 14 కిలోమీటర్ల పొడవైన వలయాకార మార్గంలో ప్రదక్షిణ చేస్తారు. తెలుగు రాస్ట్రాల నుంచి భక్తులు పౌర్ణమి రోజున, ప్రత్యేక రోజులలో వేలాది మంది భక్తులు వస్తారు. ఈ మధ్యం కాలంలో భారీగా భక్తుల రద్దీ పెరుగుతోంది. రద్దీకి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రత్యేక రైళ్లు.. అనేక ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు అరుణాచలం కు నడుపుతోంది. కాగా, ప్రస్తుతం వంట గ్యాస్ సమస్య కారణంగా లడ్డూ ప్రసాదం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకు న్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఆలయానికి గ్యాస్ సరఫరా జరిగేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+