Arvind Kejriwal : పట్టువదలని కేజ్రివాల్ ? ప్రధానికి చదువు వద్దా- మోడీపై తీవ్ర వ్యాఖ్యలు..
ప్రధాని నరేంద్రమోడీ విద్యార్హతలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ వేసిన పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు తాజాగా అవసరం లేదంటూ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పిటిషన్ వేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కు గుజరాత్ హైకోర్టు రూ.25 వేల జరిమానా కూడా విధించింది. అయినా కేజ్రివాల్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రధాని మోడీపై దాడిని మరింత ముమ్మరం చేశారు.
గుజరాత్ హైకోర్టు ఆదేశాలు ప్రధానమంత్రి చదువుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి విద్యావంతులుగా ఉండటం చాలా ముఖ్యమని కేజ్రివాల్ తెలిపారు. ఎందుకంటే ఆయన చాలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రధాన మంత్రి విద్యార్హతపై సమాచారం ఇవ్వడానికి గుజరాత్ విశ్వవిద్యాలయం సిద్ధంగా లేకపోవడానికి కేవలం రెండు కారణాలు మాత్రమే ఉన్నాయని కేజ్రివాల్ తెలిపారు. ఒకటి ఆయన అహంకారం వల్ల కావచ్చు లేదా ఆయన డిగ్రీ నకిలీది అయి ఉండొచ్చన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీల వివరాలను వెల్లడించాలంటూ గుజరాత్ యూనివర్సిటీకి సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిన్న రద్దు చేసింది. ఇప్పటికే ప్రజాబాహుళ్యంలో ఉన్న ఈ వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బిరెన్ వైష్ణవ్ రూ.25,000 జరిమానా విధించారు. నాలుగు వారాల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల పట్టాను ఆర్టీఐ ద్వారా పొందాలని అరవింద్ కేజ్రీవాల్ పట్టుబట్టడం, ఇది ఇప్పటికే ప్రజా బాహుళ్యంలో అందుబాటులో ఉన్నప్పుడు కేజ్రీవాల్ చిత్తశుద్ధి, ఉద్దేశ్యంపై సందేహం కలిగిస్తుందంటూ జస్టిస్ వైష్ణవ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications