కేజ్రీవాల్ కు బెయిల్ - విచారణపై సుప్రీం కీలక నిర్ణయం..!!

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు భారీ రిలీఫ్ దక్కింది. ఢిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్‌పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. కేజ్రీవాల్ అరెస్ట్ లో పలు అంశాలను, సెక్షన్లను పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. తన అరెస్ట్ అక్రమం అంటూ కేజ్రీవాల్ం దాఖలు చేసిన పిటీషన్ పైన విచారించిన సుప్రీంకోర్టు తన తీర్పులో అనేలక అంశాలను ప్రస్తావించింది.

తన అరెస్ట్ అక్రమం అంటకూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్ ను విస్త్రుత దర్మాసంనకు బదిలీ చేస్తూ కోర్టు ని్రణయం తీసుకుంది. అయితే, ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా..సీబీఐ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉండనున్నారు. మద్యం విధానం కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కేజ్రీవాల్ సవాలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపింది. కేజ్రీవాల్, ఈడీ వాదనల అనంతరం మే 17న తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.

Arvind Kejriwal granted interim bail by Supreme Court in ED case details here

ఆ తరవాత జూన్ 20న కేజ్రీవాల్‌కి రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేయగా... మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఆదేశాలపై గత నెల 25న స్టే ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. ఆ తర్వాత అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. గత నెల 27న కేజ్రీవాల్ ని అరెస్టు చేసి.. రౌస్ అవెన్యూ కోర్టు ముందు దర్యాప్తు సంస్థ హాజరుపరిచింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఇంతకుముందే కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్టు చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టుతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేజ్రీవాల్ జైలులోనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+