Kejriwal: ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న కేజ్రీవాల్..

ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తేవడంపై ఆప్ పోరాటం ఉధృతం చేసింది. మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీని కలిశారు. " తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, కేంద్రం తమ అధికారాన్ని పూర్తిగా తీసివేసింది. ఎనిమిదేళ్లు పోరాడి చివరకు సుప్రీంకోర్టులో విజయం సాధించాం. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు సెలవులకు ఒకరోజు ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని తమాషాగా మార్చుకున్నారు" అని కేజ్రీవాల్ అన్నారు.

బీజేపీ ప్రభుత్వం లేని చోట ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు లేదా ప్రభుత్వాన్ని భయపెట్టేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగించుకుంటారని అన్నారు. మేము వారిని రాజ్యసభలో ఓడించగలిగితే, లోక్‌సభ ఎన్నికలకు ఇది సెమీఫైనల్ అవుతుందని చెప్పారు. తాము సుప్రీం కోర్టును గౌరవిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు.

Kejriwal

"సుప్రీంకోర్టు మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీని ఓడించేందుకు కలిసి రండి. ఇదొక పెద్ద అవకాశం. దీన్ని మా పార్టీ రాజ్యసభలో వ్యతిరేకించాలి" అని అన్నారు. పంజాబ్ సిఎంత భగవంత్ మాన్ కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

"30 మంది గవర్నర్లు, ప్రధానమంత్రి దేశాన్ని నడపవలసి వస్తే, అప్పుడు ఎన్నికలు జరిగితే ప్రయోజనం ఏమిటి" అని అన్నారు. కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ తన పోరాటాన్ని జాతి పోరాటంగా అభివర్ణించారు. తమిళనాడు బిల్లులన్నీ రాజ్‌భవన్‌లో నిలిచిపోయాయని తమకు లేఖ వచ్చిందని చెప్పారు. ఇది తమ పోరాటం మాత్రమే కాదు, ఇది దేశం పోరాటమని అన్నారు."మిస్టర్ సిసోడియాతో ఢిల్లీ పోలీసులు ఎలా ప్రవర్తించారో మీరందరూ చూశారుగా" అని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+