తీహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్: ఏమన్నారంటే?

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్​ ఆద్మీ పార్టీ(AAP​) అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ తిహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు జైలు అధికారులు ఆయనను విడుదల చేశారు. కేజ్రీవాల్​ బెయిల్​ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు జైలు ముందు ఆయనకు స్వాగతం అంటూ​ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యారు.

వర్షం పడుతుండగా కారులో జైలు బయటకు వచ్చిన కేజ్రీవాల్‌​కు.. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​, ఢిల్లీ మంత్రి అతిశీ, ఆప్​ నేత మనీశ్​ సిసోడియా తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాను విడుదల ​ కావాలని కోరుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జైళ్లు తనను బలహీన పరచలేవని, తనను జైల్లో వేయడం వల్ల, తన కరేజ్​ 100 రెట్లు పెరిగిందని వ్యాఖ్యానించారు.

Arvind Kejriwal released from Tihar Jail
'ఇంత వర్షంలోనూ పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా జీవితం దేశానికే అంకితం. జీవితంలో ఎన్నో పోరాటాలు, కష్టాలు ఎదుర్కొన్నా. కానీ, సత్యమార్గంలోనే నడిచాను. అందుకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను జైలులో పెట్టి మనో ధైర్యాన్ని దెబ్బతీద్దామని కొందరు అనుకున్నారు. నేను జైలు నుంచి బయటకు వచ్చాక నా ధైర్యం 100 రెట్లు పెరిగింది. భగవంతుడు చూపిన మార్గంలోనే నడుస్తూ.. దేశానికి సేవ చేస్తూనే ఉంటాను. దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించే శక్తులపై పోరాటం కొనసాగిస్తాను' అంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

అంతకుముందు,​ బెయిల్​ పిటిషన్​‌పై విచారించిన సుప్రీంకోర్టు.. కేజ్రీవాల్‌​కు భారీ ఊరటనిచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 లక్షల బెయిల్ బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత ఢిల్లీలోని ఆప్​ ప్రధాన కార్యాలయం వెలుపల సందడి వాతావరణం నెలకొంది. సునీతా కేజ్రీవాల్​, పార్టీ సీనియర్​ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా సునీతా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రణాళికలు విఫలమయ్యాయనన్నారు. వారు అధికారంలో ఉండటానికి ప్రతిపక్ష నాయకులను కటకటాల వెనక్కి నెడుతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ మద్యం వ్యవహారంలో కేజ్రీవాల్‌కు కేవలం బెయిల్‌ మాత్రమే వచ్చిందని కాంగ్రెస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టు కేజ్రీవాల్‌కు క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అశోక్‌ శర్మ వ్యాఖ్యానించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ వేర్వేరుగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అశోక్‌ శర్మ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+